భారతదేశంలో ఈ రోజు బంగారం, వెండి ధర క్షీణించింది. ఎంసిఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు బంగారం ధర  0.15 శాతం పడిపోయి 50,425 రూపాయలకు చేరుకోగా, సిల్వర్ ఫ్యూచర్స్ 0.35 శాతం తగ్గి వెండి కిలోకు 62,832 రూపాయలకు చేరుకుంది.

గత మూడు రోజుల్లో బంగారం ధరల్లో ఇది రెండవ పతనం. అంతకుముందు బంగారం ధర 10 గ్రాములకు 1.4 శాతం అంటే 700 రూపాయలు పెరిగింది, వెండి రేటు కూడా 3.3 శాతం పెరిగింది, అంటే కిలోకు రూ .2,000 పెరుగుదల. ఈ వారం మొదటిరోజున సోమవారం బంగారం ధర 10 గ్రాములకు రూ .2,500 తగ్గింది.  

ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో కరోనా వైరస్ కేసులు పెరగడంతో ఉద్దీపన చర్యల ఆశతో బంగారం ధరలు ఈ రోజు పెరిగాయి. స్పాట్ బంగారం ఔన్స్ 0.2 శాతం పెరిగి 1,879.31 డాలర్లకు చేరుకోగా, వెండి 0.2 శాతం పెరిగి 24.26 డాలర్లకు, ప్లాటినం 0.1 శాతం పడిపోయి 881.98 డాలర్లకు చేరుకుంది.

also read దేశ ఆర్థికవ్యవస్థ మునిగిపోతున్నప్పుడు కూడా ముకేష్ అంబానీ నిమిషానికి ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా ? ...

యుఎస్ డాలర్ బలహీనపడటం బంగారానికి మద్దతు ఇచ్చింది. డాలర్ ఇండెక్స్ 0.11 శాతం క్షీణించింది.

ధంతేరాస్, దీపావళి సందర్భంగా బంగారం కొనడం చాలా పవిత్రంగా భావిస్తారు. ఇంతలో ప్రభుత్వం ఎనిమిదవ సిరీస్ సావరిన్ గోల్డ్ బాండ్ పథకాన్ని నవంబర్ 9న ప్రారంభించింది.

ఈ బాండ్‌ కోసం నవంబర్ 13 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ గోల్డ్ బాండ్‌కు బంగారం ధర గ్రాముకు రూ .5,177 గా నిర్ణయించారు. మరోవైపు, బంగారు బాండ్ల కొనుగోలు ఆన్‌లైన్‌లో జరిగితే పెట్టుబడిదారులకు ప్రభుత్వానికి గ్రాముకు రూ .50 అదనపు రిబేటు లభిస్తుంది. 

పండుగ సీజన్‌లో డిమాండ్ అనుగుణంగా ఈ ఏడాది బంగారం ధరలు 31 శాతం పెరిగాయి. ఆగస్టులో బంగారం ధర భారతదేశంలో రికార్డు స్థాయిలో 56,200 కు చేరుకోగా, వెండి కిలోకు 80,000 రూపాయలకు చేరుకుంది. పండుగ కాలంలో భారతదేశంలో బంగారం డిమాండ్ పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.