ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరం ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనావాలా (39)కు అరుదైన ఘనత దక్కింది. అదర్ పూనవాలా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐ‌ఐ) సి‌ఈ‌ఓ.

సింగపూర్ దినపత్రిక "ఆసియన్ ఆఫ్ ది ఇయర్" గౌరవానికి ప్రపంచంలోని అతిపెద్ద టీకా ఉత్పత్తి సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐ‌ఐ) సి‌ఈ‌ఓ అదార్ పూనావాలాతో సహా ఆరుగురిని పేర్కొంది. ఈ సంవత్సరం కోవిడ్ -19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటానికి సహకరించిన వారిని ఈ అరుదైన గౌరవం కోసం ఎంపిక చేశారు.

కోవిడ్ -19 వ్యాక్సిన్ 'కోవిషీల్డ్' ను అభివృద్ధి చేయడానికి పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, బ్రిటిష్-స్వీడన్ కంపెనీ ఆస్ట్రాజెనెకాతో కలిసి పనిచేస్తోంది. ఇందుకోసం టీకా పరీక్షలు భారతదేశంలో జరుగుతున్నాయి.

ఈ జాబితాలో పూనవాలాతో పాటు మరో ఐదుగురు వ్యక్తులు  చైనా పరిశోధకుడు కరోనా వైరస్‌ సార్స్‌-కోవి-2 తొలి పూర్తి జన్యువును గుర్తించినందుకు  చాంగ్‌  యోంగ్జెన్,  కరోనా వైరస్‌ అంతానికి వ్యాక్సిన్‌ రూపకల్పనలో కృషి చేసినందుకు  చైనా మేజర్-జనరల్ చెన్ వీ, జపాన్‌కు చెందిన డాక్టర్ ర్యూచికు, సింగపూర్ ప్రొఫెసర్ ఓయి ఇంగ్ ఎంగ్, దక్షిణ కొరియాకు చెందిన వ్యాపారవేత్త సియో జంగ్-జిన్ తదితరులు ఈ  అవార్డుకు ఎంపికైన వారిలో ఉన్నారు.

also read భారతదేశపు అత్యంత ధనవంతురాలైన మహిళా రోష్ని నాదర్ ఎవరు..? ఆమే మొత్తం ఆస్తి ఎంతంటే ? ...

 కరోనావైరస్ మహమ్మారి అంతంకోసం సమిష్టిగా అంకితభావంతో  పనిచేసిన వీరులుగా వీరిని "వైరస్ బస్టర్స్"గా అవార్డు ప్రశంసాపత్రంలో  కీర్తించింది.  ఆసియా అభివృద్ధికి సహాయపడిన వ్యక్తులకు, బృందాలకు లేదా సంస్థలకు ప్రతీ ఏడాదీ ఈ అవార్డులను అందిస్తుంది.

ఈ నేపథ్యంలో ఈ ఏడాది కరోనా మహమ్మారి నివారణకు పరిష్కారానికి  సమాధానం కనుగొనడంలో సాయం చేసిన వ్యక్తులకు, టీంలకు ఇవ్వాలని నిర్ణయించింది.

వీరంతా కరోనా వైరుస్ కు  వ్యతిరేకంగా టీకాలు తయారు చేయడంలో ముందున్నారు. ఈ జాబితాలో దక్షిణ కొరియాకు చెందిన వ్యాపారవేత్త సియో జంగ్-జిన్ పేరు కూడా ఉంది, అతని కంపెనీ వ్యాక్సిన్ తయారీకి, వాటిని అందుబాటులో ఉంచడానికి కూడా పని చేస్తుంది.

సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను 1966లో అదర్ పూనావాలా తండ్రి సైరస్ పూనవల్లా స్థాపించారు. 39 ఏళ్ల అదార్ పూనావాలా 2011 లో ఇన్స్టిట్యూట్ పగ్గాలు చేపట్టారు. తన సంస్థ పేద దేశాలకు వ్యాక్సిన్లు అందించడానికి సహాయం చేస్తోందని పూనవాలా అన్నారు.