Asianet News TeluguAsianet News Telugu

EMI పెరిగిందని, లోన్ రీ ఫైనాన్స్ ద్వారా బ్యాంకు లోన్‌ను మరో బ్యాంకుకు మార్చడం తెలివైన నిర్ణయమేనా..?

ఆర్‌బీఐ రెపో రేట్లను పెంచిన తర్వాత బ్యాంకులు కూడా రుణాలపై వడ్డీ రేట్లను పెంచాయి. దాదాపు అన్ని  బ్యాంకులు తమ రుణ వడ్డీ రేట్లను 10 నుండి 30 బేసిస్ పాయింట్లు పెంచాయి. దీంతో ఇది పెరిగిన EMI ఖాతాదారులపై అదనపు భారం పడేలా చేసింది. దీంతో చాలా మంది వినియోగదారులు లోన్ రీ ఫైనాన్స్ పద్ధతి ద్వారా తమ బ్యాంక్ లోన్ ఖాతాను మరో బ్యాంకుకు మార్చాలని ఆలోచిస్తున్నారు. అయితే ఇది సరైన చర్య అవుతుందా? కాదా అనేది తెలుసుకుందాం.
 

should you change your lender with loans getting expensive what are the experts opinion
Author
Hyderabad, First Published May 16, 2022, 5:40 PM IST

సాధారణంగా సొంతిల్లు కొనుగోలు చేసే వారిలో దాదాపు 90 శాతం మందికి పైగా  హోం లోన్ తోనే కొంటున్నారు. అయితే ప్రస్తుతం ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను పెంచడంతో, MCLRను చాలా బ్యాంకులు పెంచేస్తున్నాయి. దీంతో లోను తీసుకున్నప్పుడు ఉన్న వడ్డీ రేటుకి, ఇప్పుడున్న వడ్డీ రేట్లకు చాలా తేడా ఉంది. అయితే హోమ్‌ లోన్‌ రీఫైనాన్స్‌ ద్వారా ఈఎంఐ భారం తగ్గించుకునే ఒక అవకాశం ఉంది. ఇలా చేయడం వల్ల కనీసం 60 నుంచి 80 బేసిస్‌ పాయింట్ల (దాదాపు ఒక శాతం) వరకూ వడ్డీ భారం తగ్గించుకునే అవకాశం ఉంది.  కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో హోం రీ ఫైనాన్స్ కు వెళ్లడం అంత తెలివైన సూచన కాదని నిపుణులు అంటున్నారు. 

నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీరు తీసుకున్న ఈ నిర్ణయం చాలా తప్పుగా పరిగణిస్తున్నారు. భవిష్యత్తులో ఆర్బీఐ మరోసారి రెపో రేట్లను పెంచే అవకాశం ఉంది. దీంతో బ్యాంకులు మరోసారి లోన్లపై వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశం ఉంది. RBI తీసుకునే పాలసీ విధానాలు బ్యాంకులు అన్నింటికి ఒకేలా ఉంటాయి. దీంతో బ్యాంకులు తమ వడ్డీ రేట్లను పెంచేందుకు ఎక్కువ సమయం పట్టదని ఫైనాన్షియల్ ప్లానర్ అమిత్ సూరి పేర్కొన్నారు. మే 15 నుండి SBI తన MCLRని 10 బేసిస్ పాయింట్లు పెంచింది. అంతేకాదు, అన్ని ప్రధాన బ్యాంకులు తమ రుణాల వడ్డీ రేట్లను పెంచేశాయి. లోన్ ను మరో బ్యాంకుకు షిఫ్ట్ చేసే ముందు వినియోగదారులు కొన్ని రోజులు వేచి ఉండాలని ఆయన అన్నారు. సూరి ప్రకారం మీ వడ్డీ రేటులో కనీసం 40-50 బేసిస్ పాయింట్లను ఆదా అవుతుందని నిర్ధారించుకుంటేనే, బ్యాంకును మార్చాలనే నిర్ణయించుకోవాలని సూచిస్తున్నారు.

మిగిలి ఉన్న సమయాన్ని కూడా పరిగణించండి
MyMoneyMantra.com వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ రాజ్ ఖోస్లా మాట్లాడుతూ, మీ రుణం కొత్తది, పూర్తి చేయడానికి 15-20 సంవత్సరాలు ఉంటే, మీరు 0.5 శాతం తక్కువ వడ్డీని చెల్లించడం ద్వారా  బాగా ఆదా చేసుకోవచ్చనుకుంటే లోన్ షిఫ్ట్ చేయడంపై ఆలోచించుకోవచ్చు. రుణం పూర్తి కావడానికి కేవలం 1-2 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉంటే మాత్రం రీ ఫైనాన్స్ కు వెళ్లి ప్రయోజనం లేదు. బ్యాంకులు  లోన్‌ను ముందస్తుగా మూసివేసేందుకు చెల్లింపు ఛార్జీలను వసూలు చేసే వీలుంది. 

ముఖ్యంగా కొంత శాతం పొదుపు కోసం కస్టమర్ తమ రుణదాతను మార్చకూడదని ఆయన చెప్పారు. గృహ రుణాలు సాధారణంగా చాలా కాలం పాటు ఉంటాయని, ఇందులో మెరుగైన సర్వీస్ ప్రొవైడర్ బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. కాబట్టి, వినియోగదారులు రీఫైనాన్స్ కోసం మారడానికి ముందు కొత్త ఆర్థిక సంస్థ సేవలను అంచనా వేయాలని సూచించారు.

లోన్‌ రీఫైనాన్స్‌ అంటే ఏంటి ? 
ప్రస్తుతమున్న రుణాన్నిఇతర బ్యాంకుకు బదిలీ చేయడం ద్వారా వడ్డీ భారాన్ని తగ్గించుకోవడమే రుణ రీఫైనాన్స్‌ అంటారు. రుణం తీసుకున్నపుడు ఉన్న వడ్డీ రేట్ల కంటే ఇప్పుడున్న వడ్డీ రేట్లు తక్కువగా ఉండి, భవిష్యత్‌లో ఇంకా తగ్గుతాయని అనిపించినప్పుడు చాలా మంది రుణ రీఫైనాన్స్‌కు వెళతారు. ఫిక్స్‌డ్‌ వడ్డీ రేటుతో గృహ రుణాలు తీసుకున్న వ్యక్తులు ఎక్కువగా ఫ్లోటింగ్ రేటు కోసం రీఫైనాన్స్‌ చూస్తుంటారు. 

Follow Us:
Download App:
  • android
  • ios