ఈ వారంలో రెండవ ట్రేడింగ్ రోజున అంటే బుధవారం స్టాక్ మార్కెట్ స్వల్పంగా క్షీణించింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఇండెక్స్ సెన్సెక్స్ 37.8 పాయింట్లు తగ్గి 44618.04 వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ  5 పాయింట్లు బలపడి 13114.45 స్థాయిలో ముగిసింది.

గురునానక్ జయంతి సందర్భంగా భారత స్టాక్ మార్కెట్లును సోమవారం మూసివేశారు.  ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో జీడీపీ 7.5 శాతం క్షీణతకే పరిమితంకావడంతో మంగళవారం మార్కెట్లు దూకుడు చూపిన విషయం విదితమే.వెరసి ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 44,730 వద్ద గరిష్టాన్ని తాకగా.. 44,170 దిగువన కనిష్టానికి చేరింది.

నిఫ్టీ సైతం 13,129-12,984 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. హేవీవెయిట్స్ , గెయిల్, ఒఎన్‌జిసి, ఏషియన్ పెయింట్స్, కోల్ ఇండియా, టైటాన్ స్టాక్స్ ఈ రోజు గ్రీన్ మార్క్ మీద ముగిశాయి. కోటక్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, శ్రీ సిమెంట్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు రెడ్ మార్క్ వద్ద ముగిశాయి. 

also read ఉదయం లేవగానే జిమ్, 19వ అంతస్తులో అల్పాహారం.. ఇది అత్యంత ధనవంతుడైన ముకేష్ అంబానీ దినచర్య.. ...

వివిధ రంగాల ఇండెక్స్ పరిశీలిస్తే నేడు బ్యాంకులు, పిఎస్‌యు బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్స్ సర్వీసులు కాకుండా మిగతా అన్ని రంగాలు గ్రీన్ మార్క్ మీద మూగిశాయి.

వీటిలో ఎఫ్‌ఎంసిజి, ఫార్మా, మీడియా, రియాల్టీ, ఆటో, ఐటి, మెటల్ ఉన్నాయి. కెనరా బ్యాంక్‌, సన్‌ టీవీ, టీవీఎస్‌ మోటార్‌, మదర్‌సన్‌, అపోలో హాస్పిటల్స్‌, యూబీఎల్‌, ఎంజీఎల్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ 4-1.4 శాతం మధ్య క్షీణించాయి.

స్టాక్ మార్కెట్ గత వారం లాభాన్ని నమోదు చేసింది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్  ఇండెక్స్ సెన్సెక్స్ 267.47 పాయింట్లు అంటే 0.61 శాతం పెరిగి 44,149.72 పాయింట్లకు చేరుకుంది, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 109.90 పాయింట్లుతో 0.85 శాతం పెరిగి 12,968.95 పాయింట్లకు చేరుకుంది.

అయితే విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, మార్కెట్ అస్థిరత కొనసాగవచ్చు. అందువల్ల పెట్టుబడిదారులు జాగ్రత్తగా  వహించాలి అని సూచించారు. మంగళవారం స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ 1.15 శాతం లాభంతో 505.72 పాయింట్లు పెరిగి 44655.44 వద్ద ఉంది. అలాగే నిఫ్టీ 1.08 శాతం (140.10 పాయింట్లు) లాభంతో 13109.05 వద్ద ముగిసింది.