Asianet News TeluguAsianet News Telugu

షేర్ మార్కెట్: లాభాలతో ప్రారంభంమైన దేశీయ స్టాక్ మార్కెట్.. 50 వేల పైకి సెన్సెక్స్..

బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత స్టాక్ మార్కెట్ల  విజృంభణ మొదలైంది. బడ్జెట్ ప్రభావంతో  నేడు కూడా దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది.
 

share market :  stock market opened with good profits and sensex crosses 50 thousand mark
Author
Hyderabad, First Published Feb 2, 2021, 10:57 AM IST

 నిన్న అంటే ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి  బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన సంగతి మీకు తెలిసిందే. బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత స్టాక్ మార్కెట్ల  విజృంభణ మొదలైంది. బడ్జెట్ ప్రభావంతో  నేడు కూడా దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది.

ఉదయం 9.32నిమిషాలకు -  బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్   ఇండెక్స్  సెన్సెక్స్ 1335.46 పాయింట్లు (2.75 శాతం) పెరిగి 49936.07 వద్ద ఉంది. మరోవైపు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్  నిఫ్టీ 390.60 పాయింట్లు అంటే 2.74 శాతం పెరిగి 14671.80 వద్ద ఉంది. 

ప్రారంభ వాణిజ్యంలో సెన్సెక్స్ 751.66 పాయింట్లు (1.55 శాతం) 49452.27 వద్ద ప్రారంభమై, నిఫ్టీ 199.40 పాయింట్లు లేదా 1.40 శాతం లాభంతో 14480.60 స్థాయిలో ప్రారంభమైంది. నేడు 1027 స్టాక్స్ లాభపడగా 171 స్టాక్స్ క్షీణించాయి. 46 స్టాక్లలో ఎటువంటి మార్పు లేదు. 

ఉదయం 10.02నిమిషాలకు - బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్  ఇండెక్స్ సెన్సెక్స్ 1,461 పాయింట్లు (3.01 శాతం) పెరిగి 50,062.03 కు చేరుకుంది.  మరోవైపు నిఫ్టీ 433 పాయింట్లు (3.04 శాతం) పెరిగి 14,715.10 వద్ద ట్రేడవుతోంది. అంతకుముందు జనవరి 21న సెన్సెక్స్ 223.17 పాయింట్ల లాభంతో 50,015.29 వద్ద ప్రారంభమైంది. అలాగే నిఫ్టీ 14,707.70 స్థాయిలో ప్రారంభమైంది. 

also read బడ్జెట్ 2021-22: ఏ వస్తువుల ధరలు పెరుగుతున్నాయో, తగ్గుతున్నాయో తెలుసుకోండి.. ...

 24 సంవత్సరాల రికార్డు బ్రేక్ 
బిఎస్‌ఇ సూచీ నిన్న ఐదు శాతం లాభంతో ముగిసింది. బడ్జెట్ రోజున ఇది గత 24 సంవత్సరాలలో సెన్సెక్స్‌లో అతిపెద్ద విజృంభణ అని తెలిపింది. ఫిబ్రవరి 1న సెన్సెక్స్ 48600 స్థాయి దాటి 2314.84 పాయింట్ల లాభంతో మూగిసింది. 646.60 పాయింట్ల (4.74 శాతం) లాభంతో నిఫ్టీ 14281.20 వద్ద ముగిసింది.

 కొరియాకు చెందిన కోస్పి 2.23 శాతం లాభంతో ట్రేడవుతోంది. హాంకాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ ఇండెక్స్, ఆస్ట్రేలియాకు చెందిన ఆల్ ఆర్డినరీస్ ఇండెక్స్, జపాన్‌కు చెందిన నిక్కీ ఇండెక్స్ ఒక్క శాతం లాభంతో  ట్రేడవుతున్నాయి. చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ కూడా 0.55 శాతం లాభపడింది. నాస్‌డాక్ ఇండెక్స్ 2.55 శాతం, ఎస్ అండ్ పి 500 ఇండెక్స్ 1.61 శాతం పెరిగింది. యూరోపియన్ మార్కెట్లో, ఫ్రాన్స్ సి‌ఏ‌సి  ఐ‌ఎన్‌డి‌ఈ‌ఎక్స్, జర్మనీ  డాక్స్ ఇండెక్స్ కూడా  ఒక్క శాతం పెరిగాయి.

నేడు ప్రారంభ ట్రేడింగ్ సమయంలో కొన్ని  కంపెనీల షేర్లు   గ్రీన్ మార్క్ మీద ప్రారంభించాయి. వీటిలో టిసిఎస్, యాక్సిస్ బ్యాంక్, ఒఎన్‌జిసి, ఎన్‌టిపిసి, ఏషియన్ పెయింట్స్, మారుతి రిలయన్స్, ఎం అండ్ ఎం, ఎల్ అండ్ టి, ఐటిసి, ఐసిఐసిఐ బ్యాంక్, హిందుస్తాన్ యూనిలీవర్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా, హెచ్‌సిఎల్ టెక్, టెక్ మహీంద్రా ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios