న్యూ ఢీల్లీ: దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) మంగళవారం ‘యోనో సూపర్ సేవింగ్ డేస్’పేరుతో ఒక ప్రత్యేకమైన షాపింగ్ కార్నివాల్‌ను ప్రకటించింది.

యోనో సూపర్ సేవింగ్ డేస్ ఫిబ్రవరి 4న ప్రారంభమై  ఫిబ్రవరి 7 వరకు ఉంటుంది. నాలుగు రోజుల షాపింగ్ ఫెస్టివల్ సమయంలో ఎస్‌బిఐ బ్యాంకింగ్,  లైఫ్ స్టయిల్ ప్లాట్ ఫామ్, యోనో వినియోగదారులకు ప్రత్యేకమైన డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ అందిస్తుంది.

"ఈ నూతన సంవత్సరం ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, ట్రావెల్, హాస్పిటాలిటీ, అమెజాన్‌ ఆన్‌లైన్ షాపింగ్ ఇతర ప్రముఖ విభాగాలలో యోనో సూపర్ సేవింగ్ డేస్ బెస్ట్-ఇన్-క్లాస్ ఆఫర్‌లతో వస్తుంది.  ఈ షాపింగ్ ఫెస్టివల్‌లో 34.5 మిలియన్ల మంది వినియోగదారులకు ఎండ్ లెస్ షాపింగ్ ఆనందాన్ని అందించడానికి యోనో అమెజాన్, ఓవైఓ, పెప్పర్‌ఫ్రై, శామ్‌సంగ్, యాత్రతో సహా కొన్ని ఇతర వాటితో భాగస్వామ్యం చేసుకుంది.

also read 

యోనో సూపర్ సేవింగ్ డేస్‌లో కస్టమర్లు ఒయోతో హోటల్ బుకింగ్‌పై 50% వరకు, యాత్రా.కామ్‌తో ఫ్లైట్ బుకింగ్‌పై 10% తగ్గింపు, శామ్‌సంగ్ మొబైల్స్, టాబ్లెట్‌లు, గడియారాలపై 15% తగ్గింపుతో పాటు ఇతర ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు. అదనంగా యోనో వినియోగదారులు పెప్పర్‌ఫ్రై నుండి ఫర్నిచర్ కొనుగోలు చేయడానికి 7% అదనపు మినహాయింపు, అమెజాన్‌లో ఎంచుకున్న క్యాటగిరిలో షాపింగ్ చేయడానికి 20% క్యాష్‌బ్యాక్ పొందుతారు.

ఎస్‌బి‌ఐ ఎండి (రిటైల్ & డిజిటల్ బ్యాంకింగ్) సిఎస్ సెట్టి మాట్లాడుతూ, “ఈ కొత్త సంవత్సరంలో మరింత ఉత్సాహాన్ని, ఆనందాన్ని జోడించడానికి మా వినియోగదారుల కోసం యోనో సూపర్ సేవింగ్ డేస్ ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాము. బ్యాంకింగ్‌, జీవనశైలి అవసరాల దృష్ట్యా అదనపు షాపింగ్ అవసరాలను తీర్చే క్రమంలో మెగా షాపింగ్ ఈవెంట్‌  ఒక ప్రత్యేక  అడుగు అని ఆయన అన్నారు.  

మా విలువైన యోనో వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ మెగా షాపింగ్ ఈవెంట్‌లో  పాల్గొనడానికి మేము ఎదురుచూస్తున్నాము. కస్టమర్లలో యోనో ప్రజాదరణ పొందడం చూసి మేము సంతోషిస్తున్నాము. అని అన్నారు.

కేవలం 3 సంవత్సరాలలో, యోనో 74 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లు, 34.5 మిలియన్లకు పైగా రిజిస్టర్డ్   వినియోగదారులతో పెరిగింది. జీరో ప్రాసెసింగ్ ఫీజు & ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో  ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ & లైఫ్ స్టైల్, మల్టీ-కేటగిరీ, గిఫ్టింగ్, హోమ్ & ఫర్నిషింగ్, బుకింగ్ కార్స్ & ఎస్‌బి‌ఐ ఆమోదించిన ప్రాపర్టీస్, కార్ & హోమ్ లోన్లను పొందే ఆప్షన్ తో సహా 20 కి పైగా విభాగాలలో 100 కి పైగా ఇ-కామర్స్  సంస్థలతో  ఎస్‌బి‌ఐ భాగస్వామ్యం చేసుకుంది.