న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోన్స్ దిగ్గజం శ్యామ్‌సంగ్ నూతనంగా గ్యాలక్సీ నోట్ 9 ఫోన్‌ను బుధవారం భారతీయ మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఈ స్మార్ట్ ఫోన్ విక్రయాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 6జీబీ ర్యామ్, ఇంటర్నల్ మెమొరీలో 128 జీబీ సామర్థ్యంతో మార్కెట్‌లోకి విడుదల చేసింది శ్యామ్‌సంగ్. రెండు వెరైటీలతో కూడిన గ్యాలక్సీ నోట్ 9 విడుదలైంది. దీని ధర రూ.67,900 కాగా, 8 జీబీ ర్యామ్ సామర్థ్యం 512 ఇంటర్నల్ మెమొరీ గల ఫోన్ ధర రూ.84,900. ఒకవేళ తమ సంస్థ ద్వారా ప్రీ బుకింగ్ చేసుకున్న వారికి ‘పేటీఎం మాల్’ రూ.6000 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ అందజేస్తోంది. అదీ కూడా ప్రొమోకోడ్ నోట్ 9 ఫోన్ ద్వారా ప్రీ బుకింగ్ చేసుకున్న వారికే క్యాష్ బ్యాక్ వర్తిస్తుంది. 

శ్యామ్‌సంగ్ గ్యాలక్సీ నోట్ 9 ఫోన్ 6.4 అంగుళాల క్యూహెచ్డీ,  1440 x 2960 పిక్సెల్స్ రిజొల్యూషన్ 18:5:9 నిష్పత్తితోపాటు సూపర్ అమోలెడ్ డిస్ ప్లేతో ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ / 8 జీబీ ర్యామ్ ఆప్షన్లతోకూడిన రెండు వెరైటీ ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇది రెండు రకాల స్టోరేజీ ఆప్షన్లు కల్పిస్తోంది. 128 జీబీ, 512 జీబీ ఇంటర్నల్ స్టోర్ మెమొరీ సామర్థ్యం ఉన్నది. మైక్రో ఎస్డీ కార్డు ప్లస్ 512 జీబీ వరకు విస్తరించడానికి వీలు కల్పిస్తోంది. 

ఆండ్రాయిడ్ ఓరియో ఆప్షన్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్ డ్యుయల్ రేర్ కెమెరా కూడా లభిస్తుంది. 12 ఎంపీ ప్లస్ 12 ఎంపీ సెన్సర్లతోపాటు 8 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అందుబాటులో ఉంటాయి. వై- ఫై, జీపీఎస్, బ్లూ టూత్, ఎన్ఎఫ్ సీ, 3జీ, 4జీ తదితర ఫీచర్లు కూడా ఈ ఫోన్‌లో లభిస్తాయి. దీంతోపాటు 4000 ఎంఎహెచ్ బ్యాటరీ ప్యాకేజీ కూడా ఉంటుంది. 

ఇంతకుముందు గ్యాలక్సీ నోట్ 8 ఫోన్‌కు భారీగా ధర తగ్గిస్తూ క్యాష్ బ్యాక్ ఇచ్చారు. భారతదేశంలో రూ.12 వేల వరకు కత్తిరించారు. వాస్తవంగా 67,900 ధర కాగా, దానికి రూ.12 వేల వరకు ఆఫర్ అందించింది. కానీ ప్రస్తుతం ఇది మార్కెట్ లో రూ.55,900లకు అందుబాటులో ఉన్నది. అమెజాన్ ఇండియా, శ్యామ్ సంగ్ ఇండియా ఆన్ లైన్ షాపుల్లో కొనుగోలు చేయొచ్చు. గమ్మత్తేమిటంటే శ్యామ్‌సంగ్ 8 నోట్ ఫోన్‌ డిమాండ్‌లో 80 శాతం శ్యామ్‌సంగ్ 9 నోట్ ఫోన్ పొందుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.