Samhi Hotels IPO: సెప్టెంబర్ 14 నుంచి Samhi Hotels IPO ప్రారంభం..మినిమం ఎంత పెట్టుబడి పెట్టాలంటే..?

సెప్టెంబర్ 14న Samhi Hotels IPO ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ ఇష్యూలో పెట్టుబడి పెట్టే ముందు పూర్తి వివరాలను తెలుసుకోండి.

Samhi Hotels IPO Samhi Hotels IPO will start from September 14 What is the minimum investment MKA

Samhi Hotels IPO: Samhi Hotels Limited వ్యాపార విస్తరణ కోసం IPOతో ముందుకు వస్తోంది. కంపెనీ IPO సెప్టెంబర్ 14న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరుచుకుంటోంది. ఈ ఐపీఓలో రూ.1200 కోట్ల విలువైన కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నారు. ఇందులో పెట్టుబడిదారులు ఇన్వెస్ట్ చేసేందుకు ఒక్కో ఈక్విటీ షేరు ప్రైస్ బ్యాండ్ రూ. 119 నుండి రూ. 126 గా నిర్ణయించారు. 

నిజానికి ప్రైమరీ మార్కెట్ అయినటువంటి ఐపీఓలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఇన్వెస్టర్లు మంచి ఆదాయాన్ని పొందవచ్చు.లిస్టింగ్ రోజే లాభాలు పొందే వీలుంటుంది. ఈ మధ్య కాలంలో చాలా కంపెనీల ఐపీఓలలో ఇన్వెస్టర్లు బంపర్ లాభాలు ఆర్జించారు. తాజాగా Samhi Hotels IPO సెప్టెంబర్ 14న ప్రారంభం కానుంది. ఈ IPO సెప్టెంబర్ 18న ముగుస్తుంది. ఇందులో కనీసం 119 ఈక్విటీ షేర్లకు ఇన్వెస్టర్లు బిడ్డింగ్ వేయాల్సి ఉంటుంది. అంటే కనీసం రూ.14,161 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 

బ్లూ చంద్ర లిమిటెడ్, Goldman Sachs Investments Holdings (Asia) Limited, GTI Capital Alpha Pvt Ltd షేర్లు కంపెనీలు తమ భాగస్వామ్యాన్ని ఈ ఐపీవో ద్వారా విక్రయిస్తున్నాయి.  గురుగ్రామ్ ఆధారిత SAMHI హోటల్స్‌ హోటల్ రంగ వ్యాపారంలో  గత 13 ఏళ్లలో కంపెనీ వేగంగా అభివృద్ధి చెందింది. 

22న షేర్ల కేటాయింపు జరుగుతుంది

సెప్టెంబర్ 22న షేర్ల కేటాయింపు జరుగుతుంది. సెప్టెంబర్ 26న ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాల్లో షేర్లు జమ చేయబడతాయి. షేర్ల లిస్టింగ్ సెప్టెంబర్ 27న జరుగుతుంది. సంహీ హోటల్స్ ఈ IPOలో 15 శాతం వాటాను అధిక నికర విలువ కలిగిన వ్యక్తుల కోసం రిజర్వు చేసింది. 75 శాతం వాటాను అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులకు ,  10 శాతం వాటా రిటైల్ పెట్టుబడిదారులకు రిజర్వ్ చేయబడింది. గ్రే మార్కెట్ గురించి మాట్లాడుతూ, మీడియా నివేదికల ప్రకారం, దాని షేర్లు రూ. 10 GMP (గ్రే మార్కెట్ ప్రీమియం)కి విక్రయించబడుతున్నాయి.

కంపెనీ రుణాన్ని తిరిగి చెల్లిస్తుంది

కంపెనీ తాజా షేర్ల ద్వారా సేకరించిన డబ్బును రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఉపయోగిస్తుంది. ఇందులో రూ.900 కోట్లు రుణం చెల్లించేందుకు వినియోగించనున్నారు. మిగిలిన నిధులు సాధారణ కార్పొరేట్ అవసరాలను తీర్చడానికి ఉపయోగించనున్నారు. జూన్ 2023 నాటికి కంపెనీ మొత్తం రూ.2,812.5 కోట్ల రుణాన్ని కలిగి ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios