లాక్ డౌన్ వల్ల చాలా మంది ప్రజలు ఆన్‌లైన్ ఆర్డరింగ్‌కే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఆహారం కోసం మాత్రమే కాదు, రోజువారీ అవసరాలు, కిరాణా సామాగ్రి కోసం కూడా ఆన్‌లైన్ ఉపయోగిస్తున్నారు.

హైపర్‌లోకల్ డెలివరీ స్టార్టప్ డన్జో డెలివరీ ట్రెండ్స్ లో బెంగళూరు ఉల్లిపాయలను ఎక్కువగా ఆర్డర్ చేసింది. ఇక పూణే, హైదరాబాద్ పాలను, చెన్నై బంగాళాదుంపలను, ఢీల్లీ శీతల పానీయాలను ఆర్డర్ చేసినట్లు డాటా చూపించింది.

హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబైలో ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి చక్కెరకు బాదులు బెల్లం ఎంచుకోగా, ఢీల్లీలో ఎక్కువగా క్వినోవా, కాలే అలాగే ముంబైకి బ్రోకలీ, అవోకాడో ఇంకా పూణేలో బ్రౌన్ బ్రెడ్ ని ఎంచుకున్నారు.

ఈ సంవత్సరంలో ప్రజలు ఎక్కువ సమయం ఇంట్లో గడపడం వల్ల రోలింగ్ పేపర్లు, కండోమ్‌ల కోసం ఎక్కువగా ఆన్‌లైన్ షాపింగ్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రాత్రి కంటే పగటిపూటే ఎక్కువ కండోమ్‌ల కొనుగోలు జరిగాయని తెలిపింది.

also read కొనసాగుతున్న కరోనా కష్టాలు.. ఐకియా ఇండియాకు వందల కోట్ల నష్టం.. ...

డాన్జో యాప్ విడుదల చేసిన డెలివరీ ట్రెండ్ రిపోర్ట్ ప్రకారం ఈ వివరాల డేటా వెల్లడైంది. ఈ నివేదికల ప్రకారం రాత్రి కంటే పగటిపూటే కండోమ్ ఆర్డర్‌లు సగటున మూడు రెట్లు ఎక్కువ కండోమ్‌లను డాన్జో యాప్ ద్వారా ఆర్డర్ చేశారు. హైదరాబాద్ ఆరు రెట్లు, చెన్నై ఐదు రెట్లు, జైపూర్ నాలుగు రెట్లు కండోమ్‌ల కొనుగోళ్ళు పెరిగాయి.  

చెన్నై కంటే బెంగళూరులో 22 రెట్లు ఎక్కువగా రోలింగ్ పేపర్ ఆర్డర్లు డాన్జో యాప్ ద్వారా వచ్చాయని తెలిపింది. రోలింగ్ పేపర్ అనేది సిగరెట్ల తయారీకి ఉపయోగించే ఒక రకమైన కాగితం.

మరోవైపు కుటుంబ నియంత్రణ ఉత్పత్తుల గురించి మాట్లాడితే బెంగళూరు, పూణే, గురుగ్రామ్, హైదరాబాద్, ఢీల్లీలో అత్యధికంగా గర్భనిరోధక ఐపిల్ మందులు ఆర్డర్ చేయబడ్డాయి. కాగా జైపూర్‌లో అత్యధిక గర్భధారణ వస్తు సామగ్రిని యాప్ ద్వారా ఆర్డర్ చేశారు. జైపూర్‌కి  ప్రేగ్నసి టెస్టులు, చెన్నైకి సానిటరీ న్యాప్‌కిన్ల ఆర్డర్లు వచ్చాయి.

ప్రతి ఒక్కరూ చికెన్ బిర్యానీని ఇష్టపడతారు, దీనికితోడు ఫుడ్ ఆర్డర్ చేయడంలో డాన్జో యాప్ ఎంతో ఉపయోగించబడింది. చికెన్-బిర్యానీ బెంగుళూరులో అత్యధికంగా ఆర్డర్ చేసిన ఆహారంగా మారింది. కాగా, ముంబైలో దాల్ ఖిచ్డికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. చెన్నైలోని ఇడ్లీ, గురుగ్రామ్‌లోని ఆలు టిక్కి బర్గర్ ఎక్కువ ఆర్డర్ చేశారు.

 ఢీల్లీ, చెన్నై, జైపూర్లలో టీ కంటే కాఫీకి ప్రాధాన్యత ఇచ్చారు. అదనంగా ప్రజలు పెంపుడు జంతువులను కోసం డాన్జో యాప్ ని ఉపయోగించారు. పెంపుడు కుక్కల కోసం గురుగ్రామ్‌లో అత్యధిక ఆర్డర్లు ఉండగా, బెంగళూరు, పూణే, చెన్నై, హైదరాబాద్‌లో పిల్లుల ఫుడ్ కోసం ఆర్డర్ చేశారు.