Asianet News TeluguAsianet News Telugu

వరుసగా 6వ సారి ఎలాంటి మార్పు లేదు! రెపో రేటు 6.5 శాతం వద్దే !

ద్రవ్యోల్బణం రేటు రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన 4 శాతం పరిమితికి దగ్గరగా ఉన్నందున రెపో రేటు 6.5 శాతం వద్ద కొనసాగుతుందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.
 

Repo rate will remain at 6.5 percent! No change for the 6th time in a row!-sak
Author
First Published Feb 8, 2024, 10:41 PM IST

నేడు గురువారం  ఉదయం జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో రెపో రేటును యథాతథంగా 6.5 శాతంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఆర్‌బీఐ వరుసగా ఆరోసారి రెపో రేటును యథాతథంగా నిర్ణయించింది.

ఆర్థిక విధాన కమిటీ సమావేశంలో 6 మంది సభ్యులలో 5 మంది ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చారని కూడా తెలిపింది. అలాగే, రిజర్వ్ బ్యాంక్ 2024 ఆర్థిక సంవత్సరానికి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్  (GDP) అంచనాను 7 శాతం వద్ద మార్చకుండా ఉంచింది. ఇది 2023-24కి ద్రవ్యోల్బణ అంచనాను 5.4 శాతం వద్ద మార్చలేదు.

ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ విలేకరులతో మాట్లాడుతూ.. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతోంది. ఆర్‌బీఐ   బహుముఖ విధానాలు ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచడంలో బాగా పనిచేశాయని ఆయన అన్నారు.

ఉక్రెయిన్-రష్యా, ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధాలు, ఎర్ర సముద్రంలో హౌతీల దాడులతో ఏర్పడిన సంక్షోభం అనిశ్చితిని కలిగిస్తున్నాయని ఆర్‌బీఐ గవర్నర్ అన్నారు.

భారత ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతూ, "మన ఆర్థిక వ్యవస్థ వరుసగా 3వ సంవత్సరం 7 శాతానికి పైగా వృద్ధి చెందింది. FY 2024లో కనిపించిన వేగం 2025 FYలో కూడా కొనసాగుతుందని మేము ఆశిస్తున్నాము." అని అన్నారు. 

ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ రెండు నెలలకు ఒకసారి సమావేశమవుతుంది. ఈ సమావేశంలో రెపో రేటు, స్వల్పకాలిక రుణాలపై వడ్డీ రేటుపై నిర్ణయం తీసుకుంటారు.

గత ఏడాది ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు వరుసగా 5 సార్లు రెపో రేటును ఆర్‌బీఐ యథాతథంగా ఉంచింది. దీంతో రెపో రేటు 6.5 శాతంగా కొనసాగింది. ప్రస్తుత వడ్డీ రేటునే ఈ ఏడాది తొలి సమావేశంలోనూ కొనసాగించాలని నిర్ణయించింది.

ద్రవ్యోల్బణం రేటు ఆర్‌బీఐ నిర్దేశించిన 4 శాతం పరిమితికి చేరువలో ఉండడంతో ఆర్థిక వ్యవస్థ స్థిరంగా వృద్ధి చెందుతున్నందున రెపో రేటు 6.5 శాతం వద్దే ఉండవచ్చని ఆర్‌బీఐ పేర్కొంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios