రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్  ముకేష్ అంబానీతో పాటు మరో రెండు సంస్థలపై రెగ్యులేటర్ సెబీ శుక్రవారం జరిమానాలు విధించింది.

2007 నవంబర్‌లో రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ (ఆర్‌పిఎల్) షేర్లలో అవకతవకలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి  సంబంధించిన కేసులో ఈ మేరకు జరిమానాలను సెబీ విధించింది. 

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) రూ.25 కోట్లు, ముకేష్ అంబానీకి రూ.15 కోట్లు జరిమానా విధించారు. అంతేకాకుండా, నవీ ముంబై సెజ్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.20 కోట్ల, ముంబై సెజ్ లిమిటెడ్ కు 10 కోట్లు చెల్లించాలని ఆదేశించారు.

also read ఇయర్ ఎండ్ 2020: ప్రజలు ఈ సంవత్సరం ఇంటర్నెట్ లో ఎక్కువగా సెర్చ్ చేసిన టాప్ 10 ఇవే.. ...

ఈ కేసు నవంబర్ 2007లో నగదు, ఫ్యూచర్స్ విభాగాలలో ఆర్‌పిఎల్ వాటాల అమ్మకం ఇంకా కొనుగోలుకు సంబంధించినది. మార్చి 2007లో ఆర్‌ఐఎల్‌లో 4.1% వాటాను విక్రయించాలని ఇండస్ట్రీస్‌ నిర్ణయించింది. 

95 పేజీల ఉత్తర్వులో సెబీ అడ్జూడికేటింగ్ ఆఫీసర్ బి జె దిలీప్ మాట్లాడుతూ సెక్యూరిటీల వాల్యూమ్ లేదా ధరలో ఏదైనా అవకతవకలు కనుగొన్నప్పుడు మార్కెట్లో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తగ్గిస్తుంది అని చెప్పాడు.

ఆర్‌పీఎల్‌లో తన వాటా షేర్ల విక్రయానికి సంబంధించి లావాదేవీల ట్రేడింగ్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అవకతవకలకు పాల్పడిందని  బి.జె. దిలిప్‌ పేర్కొన్నారు. ఈ తాజా సెబీ ఆదేశాలపై  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఇంకా స్పందించలేదు.