ముంబై, ఆగస్టు 13, 2020: రిలయన్స్ జ్యువెల్స్ ప్రస్తుతం ఉన్న వాటికి అదనంగా ప్రత్యేకమైన ఆభరణాల కొత్త  కలెక్షన్ జోడించింది. రిలయన్స్ జ్యువల్స్ వార్షికోత్సవ సందర్భంగా  “అభార్” కలెక్షన్ పేరుతో పరిచయం చేస్తూ, గత కొన్ని సంవత్సరాలుగా రిలయన్స్ బ్రాండ్‌తో అనుబంధం ఏర్పర్చుకున్న వినియోగదారులకు కృతజ్ఞతలు తెలుపుతుంది.

ఈ సంవత్సరం కొత్త కలెక్షన్ లాంతర్ నుండి ప్రేరణ పొందింది. అబార్ కలెక్షన్ లో 54 ప్రత్యేకమైన హస్తకళా బంగారం, వజ్రాల చెవిరింగులు ఉన్నాయి, వీటిలో డాంగ్లర్స్, ఫ్రింగ్స్, టాప్ & డ్రాప్స్, చాన్డిలియర్స్, జుమ్కిస్, స్టడ్స్, నీడీల్స్, చంద్ బాలి వంటివి 3 గ్రాముల నుండి 15 గ్రాముల వరకు ఉన్నాయి.

ఈ కొత్త కలెక్షన్ #WeOweYou అనే ఆలోచన థీమ్ తో ఉంటుంది. కొన్ని సంవత్సరాలుగా రిలయన్స్ జ్యువల్స్ బ్రాండ్‌పై విశ్వాసం, నమ్మకాన్ని ఉంచిన వినియోగదారుల పట్ల స్కేర్‌ క్రవ్ ఎం& సి సాచి కృతజ్ఞతలు తెలుపుతుంది.

విశ్వసనీయ కస్టమర్లు నిరంతర సహకారం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ “అబార్”  కలెక్షన్, “#WeOweYou” ప్రచారం ద్వారా రిలయన్స్ జ్యువెల్స్ బ్రాండ్ వార్షికోత్సవాన్ని సంప్రదాయంగా కొనసాగిస్తుంది.#WeOweYou అనేది మల్టీమీడియా ప్రచారం, ఇందుకోసం ఒక 4 నిమిషాల డిజిటల్ వీడియోని కూడా ఆవిష్కరించింది.

also read బంగారం, వెండి ధరలకు రష్యా ‘ వ్యాక్సిన్‌’ బ్రేకులు.. ...

 కరోనా వైరస్ వ్యాప్తి వంటి కష్ట సమయాల్లో కూడా బ్రాండ్ వినియోగదారుల ప్రేమ, సహకారం అందుకుంటున్నందుకు ఈ సంవత్సరం ఎంతో ప్రత్యేకమైనది. కొత్త అబార్ చెవిరింగుల కలెక్షన్ ను పరిచయం చేస్తూ, రిలయన్స్ జ్యువెల్స్ ఆగస్టు 31 వరకు ప్రత్యేక వార్షికోత్సవ ఆఫర్‌ను కూడా ప్రకటించింది,

ఇందులో బంగారు ఆభరణాల తయారీపై  30% ఫ్లాట్ ఆఫర్, వజ్రాలపై 30% ఆఫర్ అందిస్తుంది. షరతులు, నియమాలు వర్తిస్థాయి.

కస్టమర్లు మా షోరూమ్ ప్రవేశించినప్పటి నుండి బయటికి వెళ్ళే వరకు సంపూర్ణ భద్రతా విధానానికి కట్టుబడి ఉండటంతో పాటు రిలయన్స్ జ్యుయల్స్ తన షోరూమ్ ఆపరేటింగ్ ప్రమాణాలను రూపొందించింది. సామాజిక దూరం నియమాలను పాటించడానికి, భద్రతా నిబంధనలు, మార్గదర్శకాలను అనుసరించడానికి  షోరూంలో పనిచేసేవారికి  ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇచ్చింది.

కొత్త కలెక్షన్ పై రిలయన్స్ జ్యువెల్స్ ప్రతినిధి మాట్లాడుతూ “. #WEOWEYOU ప్రచార ఆలోచనతో, ఆధునిక భారతీయ మహిళల ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని అబార్ కలెక్షన్ రూపొందించింది. ఈ కలెక్షన్ ద్వారా మా కస్టమర్లు సంవత్సరాలుగా మాకు ఇచ్చిన సహకారానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

లాంతర్ తో ప్రేరణ పొందిన అబార్ కలెక్షన్ ప్రారంభించడం ద్వారా కొత్త అనుభూతుని కలిగించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. మా కస్టమర్‌లు ఈ అందమైన కలెక్షన్ ఇష్టపడతారని మేము ఆశిస్తున్నాము, వారికి అత్యంత ప్రత్యేకమైన ఆభరణాల డిజైన్లను తీసుకురావడం మా బాధ్యత. ”

ఈ అద్భుతమైన ఆభరణాలు దేశంలోని అన్ని రిలయన్స్ జ్యువల్స్ షోరూమ్‌లలో ప్రత్యేకంగా లభిస్తాయి.