రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) తన అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌విఎల్) చెన్నైకి చెందిన విటాలిక్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకున్నట్లు ప్రకటించింది. దాని అనుబంధ సంస్థలను కూడా(సమిష్టిగా 'నెట్‌మెడ్స్' అని పిలుస్తారు)620 కోట్లకు  చేజిక్కిచ్చుకుంది.

ఈ పెట్టుబడి వైటాలిక్  ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో 60 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ట్రెసారా హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్, నెట్‌మెడ్స్ మార్కెట్ ప్లేస్ లిమిటెడ్, దాదా ఫార్మా డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్‌తో సహా దాని అనుబంధ సంస్థల 100 శాతం ప్రత్యక్ష ఈక్విటీ యాజమాన్యాన్ని దక్కిచుకుంది.

రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరెక్టర్ ఇషా అంబానీ మాట్లాడుతూ నెట్‌మెడ్స్‌లో పెట్టుబడులు పెట్టడం భారతదేశంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ సదుపాయాన్ని కల్పించడమే.

also read ఆన్‌లైన్‌ ఫార్మసీని ప్రారంభించిన అమెజాన్‌.. అది చట్టవిరుద్ధమని పీఎంఓకు లేఖ.. ...

"నెట్‌మెడ్ల కలయిక మంచి నాణ్యత, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, సేవలను అందించడం రిలయన్స్ రిటైల్ సామర్థ్యాన్ని పెంచుతుంది. వినియోగదారుల రోజువారీ అవసరాలను తిర్చడానికి డిజిటల్ వాణిజ్య ప్రతిపాదనను విస్తృతం చేస్తుంది."

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా కూడా తాజాగా ఈ-ఫార్మసీ సేవలను బెంగళూరులో ప్రారంభించి, ఇతర నగరాల్లో పైలట్లను నిర్వహించే ప్రణాళికలను ప్రకటించిన కొద్ది రోజుల తరువాత రిలయన్స్ రిటైల్ ఆన్‌లైన్ ఫార్మసీ విభాగంలోకి ప్రవేశించింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ మే నెలలో ఆన్‌లైన్ గ్రోసారి స్టోర్ జియోమార్ట్‌ను ప్రారంభించింది. ఈ-కామర్స్ మార్కెట్లో అమెజాన్.కామ్ ఇంక్, వాల్‌మార్ట్ ఇంక్, ఫ్లిప్‌కార్ట్‌లకు పోటీగా జియోమార్ట్‌ నిలుస్తుంది.

కోవిడ్ -19 మహమ్మారి ఈ-ఫార్మా రంగానికి ఒక వరం. లాక్ డౌన్ ప్రజలను ఇళ్లకే  పరిమితం చేయడంతో, చాలామంది ఫస్ట్-టైమ్ కస్టమర్లు ఇంటి నుండి మందులను ఆర్డర్ చేయడానికి మొబైల్ ఫార్మా యాప్స్ ఉపయోగిస్తున్నారు.