Asianet News TeluguAsianet News Telugu

రిలయన్స్‌ ఇండస్ట్రీస్ చేతికి ఆన్‌లైన్ లోదుస్తుల సంస్థ జివామే..

ఆక్టోసెర్బా యాక్టివ్ హోల్‌సేల్‌లో మైనారిటీ వాటాను కొనుగోలు చేసినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో రిలయన్స్‌   ధృవీకరించింది. ఈ లావాదేవీ 2020 సెప్టెంబర్ 30తో ముగిసిన మొదటి అర్ధ సంవత్సరంలో ముగిసిందిని తెలిపింది.
 

Reliance industries confirms buying stake in lingerie retailer Zivame
Author
Hyderabad, First Published Dec 1, 2020, 12:07 PM IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్), ఆన్‌లైన్ లోదుస్తుల స్టోర్ జివామెను సొంతం చేసుకుంది. ఆక్టోసెర్బా యాక్టివ్ హోల్‌సేల్‌లో మైనారిటీ వాటాను కొనుగోలు చేసినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో రిలయన్స్‌   ధృవీకరించింది. ఈ లావాదేవీ 2020 సెప్టెంబర్ 30తో ముగిసిన మొదటి అర్ధ సంవత్సరంలో ముగిసిందిని తెలిపింది.

బిఎస్‌ఇలో సంబంధిత పార్టీ లావాదేవీల జాబితాను వెల్లడించిన ముకేష్ అంబానీ నేతృత్వంలోని ఆయిల్-టు-టెలికాం బెహెమోత్ యాక్టోసెర్బా యాక్టివ్ హోల్‌సేల్‌ అసోసియేట్ కంపెనీగా పేర్కొంది. ఆర్‌ఐఎల్ 38 సంస్థలను అసోసియేట్ కంపెనీగా జాబితా చేసింది.

మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ప్రకారం ఈ కంపెనీలో 15 శాతం వాటాను కొనుగోలు చేసింది.

జూలైలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ బ్రాండ్స్, జివామెలోని రోనీ స్క్రూవాలా యాజమాన్యంలోని యునిలేజర్ వెంచర్స్ వాటాను కొనుగోలు చేసినట్లు తెలిసింది. తన కంపెనీ జివామెలోని మొత్తం 15 శాతం వాటాను రిలయన్స్ బ్రాండ్స్‌కు అమ్మినట్లు స్కువాలా తెలిపారు.

also read 'అనవసరమైన' ఖర్చులను తగ్గించుకోండి.. భీమా సంస్థలకు కేంద్రం సలహా.. ...

2011లో స్థాపించిన బెంగళూరుకు చెందిన యాక్టోసెర్బా యాక్టివ్ హోల్‌సేల్, జివామే అని కూడా పిలుస్తారు, ఇది జాబితా చేయని ప్రైవేట్ సంస్థ, ఇది మహిళల కోసం ఆన్‌లైన్ లోదుస్తుల స్టోర్ నిర్వహిస్తుంది.

స్టార్టప్ యాక్టివ్‌వేర్, స్లీప్‌వేర్, షేప్‌వేర్ వంటి ఇతర విభాగాలలోకి ప్రవేశించింది. జివామే వెబ్‌సైట్ ప్రకారం ప్రస్తుతం 30 పైగా రిటైల్ స్టోర్లను కలిగి ఉంది. దేశవ్యాప్తంగా 800 కి పైగా భాగస్వామి దుకాణాలలో ఉంది.

అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ.32 కోట్లతో పోలిస్తే 2019 మార్చి నాటికి కంపెనీ రూ .19.5 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేయగా, రూ.140 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios