రిలయన్స్ ఫౌండేషన్ UG స్కాలర్‌షిప్స్ ఫలితాల ప్రకటన; 5వేల మంది స్టూడెంట్స్ ఎంపిక..
UG స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లో మొత్తం 5,000 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. విద్యార్థులు వారి UG స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్- www.reliancefoundation.orgలో చూసుకోవచ్చు
న్యూఢిల్లీ: రిలయన్స్ ఫౌండేషన్ అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్ 2023-24 ప్రోగ్రామ్ ఫలితాలను ప్రకటించింది. UG స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లో మొత్తం 5,000 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. విద్యార్థులు UG స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్- www.reliancefoundation.orgలో చూసుకోవచ్చు.
5,500 విద్యా సంస్థల్లో చదువుతున్న మొత్తం 58,000 మంది విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థులు మెరిట్-కమ్-మీన్స్ ప్రక్రియ ద్వారా ఎంపిక చేయబడ్డారు. ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇంకా ప్లస్ 2లో మార్కుల ఆధారంగా సెలెక్షన్ జరిగింది. ఎంపికైన విద్యార్థులలో 75 శాతం మంది వార్షిక కుటుంబ ఆదాయం రూ. 2.5 లక్షల కంటే తక్కువ.
రిలయన్స్ 1996 నుండి అర్హులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తూ, డిసెంబర్ 2022లో రిలయన్స్ వ్యవస్థాపకుడు-ఛైర్మన్ ధీరూభాయ్ అంబానీ 90వ జన్మదినోత్సవం సందర్భంగా, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అండ్ చైర్‌పర్సన్ నీతా అంబానీ రాబోయే 10 సంవత్సరాలలో 50,000 స్కాలర్‌షిప్‌లను అందించనున్నట్లు ప్రకటించారు. 2023-24 స్కాలర్‌షిప్ కోసం 5000 మంది విద్యార్థుల పేర్లతో కూడిన ఈ ప్రకటన భారతదేశ భవిష్యత్తును నిర్మించడంలో రిలయన్స్ నిబద్ధతను నొక్కి చెబుతుంది.
రిలయన్స్ ఫౌండేషన్ 23,136 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను ప్రదానం చేసింది, ఇందులో 48 శాతం మహిళా విద్యార్థులు ఇంకా 3,001 మంది వైకల్యం విద్యార్థులు ఉన్నారు. స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లో కామర్స్, ఆర్ట్స్, బిజినెస్/మేనేజ్‌మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్, సైన్స్, మెడిసిన్, లా, ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్/టెక్నాలజీ, UG డిగ్రీల విద్యార్థులు ఉంటారు.
రిలయన్స్ ఫౌండేషన్ UG స్కాలర్‌షిప్‌లు 2023-24 ఫలితాలను చెక్ చేయడానికి, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్- www.reliancefoundation.org ని సందర్శించాలి. తరువాత UG స్కాలర్‌షిప్‌లు 2023-24 ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి. అవసరమైన లాగ్-ఇన్ వివరాలు ఎంటర్ చేయండి. UG స్కాలర్‌షిప్‌ల 2023-24 మెరిట్ లిస్ట్ PDF డౌన్‌లోడ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. తరువాత సూచన కోసం UG స్కాలర్‌షిప్‌ల 2023-24 మెరిట్ లిస్ట్ PDFని సేవ్ చేయండి.
రిలయన్స్ ఫౌండేషన్ UG స్కాలర్‌షిప్‌లు 2024 ఫలితాలు: reliancefoundation.orgలో ఎలా చెక్ చేయాలి
*అధికారిక వెబ్‌సైట్- reliancefoundation.org ని ఓపెన్ చేయండి
*UG స్కాలర్‌షిప్‌లు 2024 ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి
*రిజిస్ట్రేషన్ నంబర్/రోల్ నంబర్, పుట్టిన తేదీని అవసరమైన వివరాలు అందించండి
*రిలయన్స్ ఫౌండేషన్ UG స్కాలర్‌షిప్‌లు 2024 మెరిట్ లిస్ట్ PDF డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది
*మెరిట్ లిస్ట్ PDFని సేవ్ చేసి, దాని హార్డ్ కాపీని తీసుకోండి.
*రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు అండ్ చైర్‌పర్సన్ నీతా అంబానీ నేతృత్వంలో ఉంది. గ్రామీణ పరివర్తన, విద్య, ఆరోగ్యం, అభివృద్ధి కోసం క్రీడలు, విపత్తు నిర్వహణ, మహిళా సాధికారత, పట్టణ పునరుద్ధరణ అండ్ కళలు, *సంస్కృతి అలాగే వారసత్వంపై పనిచేయడం కంపెనీ లక్ష్యం.