Reliance 46th AGM 2023: రిలయన్స్ ఏజీఎం అప్‌డేట్స్...మరో 5 ఏళ్ల పాటు రిలయన్స్ చైర్మన్ ఎండీగా ముఖేష్ అంబానీ..

రిలయన్స్ ఏజీఎం సమావేశంలో ముఖేష్ అంబానీ వాటాదారులను ఉద్దేశించి ప్రసంగించడం ప్రారంభించారు. భారతదేశంలో గత 10 సంవత్సరాలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 150 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిందని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. 

Reliance 46th AGM 2023: Commencement of Reliance AGM.. Commencement of Jio Air Fiber services on the occasion of Vinayaka Chawthi MKA

Reliance 46th AGM 2023: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL)  46వ AGM సమావేశం ప్రారంభం అయ్యింది. గ్రూపు అదినేత ముఖేష్ అంబానీ పెట్టుబడిదారులను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కంపెనీ విస్తరణ, ఆదాయం, నూతన వ్యాపారాల గురించి పేర్కొన్నారు. ఇందులో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ గత 10 ఏళ్లలో 150 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టిందని షేర్‌హోల్డర్లను ఉద్దేశించి  ముఖేష్ అంబానీ తెలిపారు. అంతేకాకుండా, ఉపాధి కల్పనలో RIL కొత్త రికార్డులను సృష్టించిందని, 2023-24లో 2.6 లక్షల ఉద్యోగాలను  సృష్టించిందని ఆయన తెలిపారు.

 ఏజీఎం లో పేర్కొన్న కీలక అంశాలు ఇవే

వినాయక చవితి నుంచి జియో ఎయిర్ ఫైబర్ ప్రారంభం

>> జియో ఎయిర్‌ ఫైబర్ సర్వీసును సెప్టెంబర్ 19న వినాయక చవితి శుభ సందర్భంగా లాంచ్ కానుంది.

ప్రతి 10 సెకన్లు ఒక 5జీ ఫోన్ జియో నెట్ వర్క్ లోకి వస్తోంది..

>> జియో 5G సేవలు ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశమంతా కవర్ అయ్యేలా కృషి చేస్తున్నామని తెలిపారు. భారతదేశంలో పనిచేస్తున్న మొత్తం 5G  మొబైల్ ఫోన్లలో దాదాపు 85 శాతం జియో నెట్‌వర్క్‌  సేవలు పొందుతున్నాయని  ముకేశ్ అంబానీ ఈ సందర్భంగా తెలిపారు. ఒక్కో కస్టమర్ ప్రతి నెల సగటున 25 GB వినియోగిస్తున్నట్లు  పేర్కొన్నారు. డిసెంబర్ నాటికి జియో నెట్‌వర్క్‌లో దాదాపు 1 మిలియన్ 5G  మొబైల్ ఫోన్లు పనిచేస్తాయని ముఖేష్ అంబానీ  అంచనా వేశారు. ప్రతి 10 సెకన్లకు ఒక 5జీ ఫోన్ రిలయన్స్ జియో నెట్ వర్క్ లో యాడ్ అవుతున్నట్లు అంబానీ తెలిపారు.

RIL బోర్డు నుంచి నీతా ఔట్..ఇషా, ఆకాష్, అనంత్ ఇన్..

>> ముఖేష్, అంబానీ వారసులు ఇషా, ఆకాష్, అనంత్‌లను కంపెనీ బోర్డులో నియమించినట్లు ఏజీఎంలో తెలిపారు. కంపెనీ బోర్డు నుంచి  నీతా అంబానీ వైదొలగనున్నారు..కాగా ఆమె రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా ఆమె కొనసాగనున్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఆల్...త్వరలోనే దశీయ ఏఐ టెక్నాలజీ

>> ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)  టెక్నాలజీ ప్రస్తుతం  ప్రపంచ పురోగతిని  మార్చేందుకు సిద్ధమవుతోందని ఇప్పటికే ఈ రంగంలో పలు సంస్థలు అభివృద్ధి సాధించాయని అంబానీ పేర్కొన్నారు.  అయితే తాము కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో ప్రవేశిస్తున్నట్లు "భారత్-కేంద్రీకృత AI మోడల్‌లను అభివృద్ధి చేయడంలో జియో  ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. 'అందరికీ AI'  అనే నినాదంతో ముందుకు వెళ్తామని ముఖేష్ అంబానీ సూచించారు.

రిలయన్స్ రిటైల్ గ్లోబల్ టాప్ 100  కంపెనీల్లో ఒకటి 

>>  రిలయన్స్ రిటైల్ గ్లోబల్ టాప్ 100 రిటైలర్ కంపెనీల్లో ఒకటిగా నిలిచిన ఏకైక భారతీయ రిటైలర్ గా నిలిచింది, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైలర్‌లలో రిలయన్స్ జియో ఒకటి అని ముఖేష్ అంబానీ చెప్పారు.

వచ్చే 5 సంవత్సరాలలో 100 CBG ప్లాంట్ల  ఏర్పాటు లక్ష్యం 

>> రాబోయే ఐదేళ్లలో 100 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖేష్ అంబానీ చెప్పారు.

2026 నాటికి బ్యాటరీ గిగా ఫ్యాక్టరీ ప్రారంభం

>> RIL 2026 నాటికి భారతదేశంలో బ్యాటరీ గిగా ఫ్యాక్టరీని ప్రారంభించనుంది. ఇందులో బ్యాటరీ రీసైక్లింగ్ సదుపాయం కూడా ఉంటుందని ముఖేష్ అంబానీ ప్రకటించారు..

ఆర్థిక సేవారంగంలో ఖాళీలను పూరించడానికి JFSL ప్రారంభించాం..,

>> భారతదేశంలో ఆర్థిక సేవల రంగంలోని ఖాళీలను పూరించడానికి JFSL ప్రారంభించినట్లు  ముఖేష్ అంబానీతెలిపారు. JFSL ఉత్పత్తులు బ్లాక్‌చెయిన్ ఆధారిత ప్లాట్‌ఫారమ్‌లుగా పనిచేస్తాయి.

>> రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ముఖేష్ అంబానీ వచ్చే ఐదేళ్లపాటు కొనసాగనున్నారు. తన పిల్లలతో పాటు, కంపెనీలోని ఇతర కీలక వ్యక్తులకు ఆయన  మార్గదర్శకత్వం చేయనున్నారు. 

మరిన్ని అప్ డేట్స్ కోసం వేచి చూడండి..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios