Repo Rate Hiked by 50 bps: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకే రెపోరేటును పెంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. మూడు రోజుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) చర్చల అనంతరం ఈ కీలక నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంపీసీ సమావేశంలో రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 4.90 శాతంగా ప్రకటించింది. రెపో రేటు అనేది ఆర్‌బీఐ వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ రుణాలు ఇచ్చే రేటు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి రెపో రేటు ముఖ్యమైన సాధనం. ద్రవ్యోల్బణం వల్ల ఇంధనంతో సహా పలు వస్తువుల ధరలు పెరిగాయి. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా వస్తువుల ధరలను మరింతగా పెంచింది.
ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును 0.50 శాతం పెంచింది. ఆ తర్వాత రెపో రేటు 4.90 శాతానికి చేరింది. అంటే ఇప్పుడు బ్యాంకులు ఆర్బీఐ నుంచి డబ్బులు తీసుకోవడమే ఖరీదుగా మారింది. ఇది మీ అన్ని లోన్ EMIలపై ప్రభావం చూపుతుంది. ఇల్లు, కారు, వ్యక్తిగత రుణాలు సహా అన్ని రకాల రుణాలపై వడ్డీ రేటును బ్యాంకులు పెంచనున్నాయి. దీంతో రానున్న రోజుల్లో ఈఎంఐ భారం మరింత పెరగనుంది. ఉదాహరణకు మీరు 30 లక్షలు లేదా 50 హోమ్ లోన్ తీసుకున్నట్లయితే, ఎంత EMI చెల్లించాల్సి ఉంటుందో తెలుసుకోండి. అదే సమయంలో రూ.5 నుంచి 10 లక్షల వరకు కారు లోన్ ఉంటే ఎంత ఈఎంఐ పెరుగుతుందో తెలుసుకుందాం.
గృహ రుణం మొత్తం: రూ. 30 లక్షలు
లోన్ కాలవ్యవధి: 20 సంవత్సరాలు
వడ్డీ రేటు: 7.50% p.a
EMI: రూ. 24,168
ఇప్పుడు రెపో రేటును 0.50% పెంచిన తర్వాత EMI
గృహ రుణం మొత్తం: రూ. 30 లక్షలు
లోన్ కాలవ్యవధి: 20 సంవత్సరాలు
వడ్డీ రేటు: 08% p.a.
EMI: రూ. 25,093
============================
గృహ రుణం మొత్తం: రూ. 50 లక్షలు
లోన్ కాలవ్యవధి: 20 సంవత్సరాలు
వడ్డీ రేటు: 7.50% p.a.
EMI: రూ. 40,280
ఇప్పుడు రెపో రేటును 0.50% పెంచిన తర్వాత EMI
గృహ రుణం మొత్తం: రూ. 50 లక్షలు
లోన్ కాలవ్యవధి: 20 సంవత్సరాలు
వడ్డీ రేటు: 7.50% p.a.
EMI: రూ. 41,822
=========================
కారు లోన్ మొత్తం: రూ. 5 లక్షలు
లోన్ కాలవ్యవధి: 5 సంవత్సరాలు
వడ్డీ రేటు: 8.5% p.a.
EMI: రూ. 10,258
ఇప్పుడు రెపో రేటును 0.50% పెంచిన తర్వాత EMI
కారు లోన్ మొత్తం: రూ. 5 లక్షలు
లోన్ కాలవ్యవధి: 5 సంవత్సరాలు
వడ్డీ రేటు: 9% p.a.
EMI: రూ. 10,379
=========================
వ్యక్తిగత, క్రెడిట్ కార్డు రుణాలపై కూడా భారం పెరుగుతుంది. రెపో రేటు పెంపు రాబోయే రోజుల్లో మీ వ్యక్తిగత, క్రెడిట్ కార్డ్ లోన్ EMIలను కూడా పెంచుతుంది.
