రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ద్రవ్య విధాన కమిటీ సమావేశం నేడు ముగిసింది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ విలేకరుల సమావేశం నిర్వహించి కమిటీ తీసుకున్న నిర్ణయాలను ప్రకటించారు. రాబోయే కొద్ది నెలలు ఆర్థిక వ్యవస్థకు చాలా ముఖ్యమైనవి అని సూచించారు.

మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును యథాతథంగా 4 శాతం వద్దనే కొనసాగించేందుకు నిర్ణయించింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేటు లేదా రెపో రేటును 1.15 శాతం తగ్గించిన విషయం తెలిసిందే.

చివరిసారి వడ్డీ రేట్లు మేలో 0.40 శాతం, మార్చిలో 0.75 శాతం తగ్గించింది. శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ సమావేశం డిసెంబర్ 2న ప్రారంభమైంది. ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ద్రవ్య విధాన కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

*రెపో రేటులో ఆర్‌బిఐ ఎటువంటి మార్పు చేయలేదు. ఇది నాలుగు శాతంగా ఉంది. ఎంపిసి ఈ నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకుంది. అంటే, వినియోగదారులకు రుణ వడ్డీ రేట్లపై కొత్త ఉపశమనం లభించలేదు

.*రివర్స్ రెపో రేటును కూడా 3.35 శాతంగా స్థిరంగా ఉంచామని దాస్ చెప్పారు. 

also read టాంగా నుండి ప్రారంభమై వేల కోట్ల వ్యాపారంలోకి: మసాలా కింగ్, ఎండిహెచ్ యజమాని జీవిత చరిత్ర.. ...

* ఈ ఆర్థిక సంవత్సరానికి(2020-21) జీడీపీపై తొలుత వేసిన -9.5 శాతం అంచనాలను ఆర్‌బీఐ తాజాగా -7.5 శాతానికి సవరించింది.

*ఎస్‌ఎల్‌ఆర్ 18 శాతం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్) రేటు 4.25 శాతంగా ఉంది.

*అధిక స్థాయి ద్రవ్యోల్బణం దృష్ట్యా, ద్రవ్య విధాన కమిటీ సభ్యులందరూ పాలసీ రేటును మార్చకుండా ఉండటానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు.

*శీతాకాలంలో ద్రవ్యోల్బణం తగ్గుతుందని ఆశిస్తూ ఆర్‌బిఐ ద్రవ్య విధానంలో మృదువైన వైఖరిని కొనసాగించింది. 

*ద్వితీయార్థం(అక్టోబర్‌- మార్చి)లో ఆర్థిక వ్యవస్థ సానుకూల వృద్ధిని సాధించనున్నట్లు భావిస్తోంది. అదేవిధంగా క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో 0.1 శాతం వృద్ధి సాధించవచ్చని ఊహిస్తోంది. 

* ఆర్‌బిఐ వచ్చే త్రైమాసికంలో జిడిపి వృద్ధి అంచనాను 0.10 శాతానికి పెంచింది. నాల్గవ త్రైమాసికంలో దేశ జిడిపి వృద్ధి 0.70 శాతంగా ఉంటుందని అంచనా. 

* అయితే, మొత్తం ఆర్థిక సంవత్సరంలో జిడిపి వృద్ధి -7.5% ఉంటుందని అంచనా. 

*వినియోగదారుల ధరల సూచిక ఆధారంగా ద్రవ్యోల్బణం మూడవ త్రైమాసికంలో 6.8 శాతం, నాల్గవ త్రైమాసికంలో 5.8 శాతంగా ఉంటుందని అంచనా.