పసిడి ప్రియులకు ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి ఎందుకంటే బంగారం ధరలు గడిచిన 10 రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి తాజాగా బంగారం ధర అన గమనించినట్లయితే గరిష్ట స్థాయి నుంచి దాదాపు 2500 రూపాయలు తగ్గింది. దీంతో పసిడి ప్రియులు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

ముఖ్యంగా బంగారం ధర 24 క్యారెట్లు 10 గ్రాముల ధర దాదాపు రూ.56000 దిగువకు చేరుకుంది. దీంతో రిటైల్ మార్కెట్లో పసిడి ఆభరణాలు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే భవిష్యత్తులో ఇది మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే బంగారం ధర తగ్గే కొద్దీ పచ్చడి ఆభరణాల మార్కెట్లో కొనుగోళ్ల సందడి కనిపిస్తుందని ఆభరణాల తయారీదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

బంగారాన్ని పడేస్తున్న డాలర్ బలం.. 

బంగారం ధర తగ్గడం వెనక అంతర్జాతీయ కారణాలు సైతం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు ముఖ్యంగా అమెరికాలో డాలర్ ధర బలపడటం కూడా ఎందుకు ఒక కారణం అని చెబుతున్నారు అయితే డాలర్ ధర ప్రస్తుతం అన్ని అంతర్జాతీయ కరెన్సీలతో పోల్చితే చాలా వేగంగా బలోపేతం అవుతుంది దీంతో మదుపుదారులు ఎక్కువగా అమెరికన్ బాండ్స్ కొనేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. అమెరికా ఆర్థిక మాంద్యం నుంచి బయటపడేందుకు కీలక వడ్డీరేట్లను తగ్గిస్తుంది ఇది కూడా డాలర్ బలం పెంచుకోవడానికి దోహదపడింది. అయితే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే బంగారంపై పెట్టుబడి పెట్టిన వారంతా ఇప్పుడు యూఎస్ బాండ్స్ కొనేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా రిటైల్ మార్కెట్లో సైతం బంగారం ధర తగ్గుతూ వస్తోంది. 

బంగారం ధర ఇదే స్థాయిలో తగ్గుతూ వస్తే భవిష్యత్తులో రూ. 50 వేల దిగువకు సైతం వచ్చే అవకాశం ఉందని, నిపుణులు పేర్కొంటున్నారు. అయితే పసిడి ధరలు ఈ స్థాయిలో తగ్గడం వెనక అమెరికాలోని బంగారం ధర ఔన్స్ అంటే 31 గ్రాములకు గానూ 1800 డాలర్ల దిగువకు పడటం కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే దేశీయంగా కూడా ధర భారీగా పెరగటంతో బంగారానికి డిమాండ్ తగ్గింది. ఫలితంగా ధర తగ్గాల్సి వచ్చింది. 

నిజానికి బంగారం ధర 2010లో రూ.18,000 వద్ద ట్రేడ్ అయ్యింది. కానీ 2020 నాటికి బంగారం ధర ఏకంగా రూ. 56వేల స్థాయికి చేరింది అంటే దాదాపు మూడు రెట్లు పెరిగింది. ముఖ్యంగా కరోనా నేపథ్యంలో బంగారం ధర 2019లో రూ. 35 వేల రూపాయల నుంచి ఏకంగా రూ. 55 వేల రూపాయలకు ఎగిసింది అంటే దాదాపు రూ. 20 వేల రూపాయలు పెరిగింది. అక్కడినుంచి బంగారం ధర మళ్ళీ రూ. 50000 దిగువకు తగ్గింది. కానీ మళ్ళీ ఈ సంవత్సరం బంగారం ధర రికార్డు స్థాయిలో రూ. 58 వేల వరకు తాకి నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది. రెండు ఇలాగే కొనసాగితే పసిడి ధర మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అమెరికన్ మార్కెట్ రికవరీ అయ్యే కొద్ది బంగారం ధర తగ్గుతుందని, అయితే ఆర్థిక మాంద్యం పెరిగితే మాత్రం బంగారం ధర భారీగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.