దేశంలోని ప్రముఖ నగరాలలో ఒకటైన ముంబైలో 26/11 ఉగ్రవాద దాడి జరిగి 12 సంవత్సరాలు కావొస్తుంది. ఈ ఘటన పై భారత ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ చేశారు.

ఇందులో "జరిగిన వినాశన విధ్వంసం ఎప్పటికీ మరచిపోలేము" అంటూ జరిగిన ఘటనను గుర్తుచేసుకుంటూ కామెంట్ చేశారు. ఈ దాడి పై రతన్ టాటా ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ పెయింటింగ్ను పోస్ట్లో ద్వారా షేర్ చేశారు. 

రతన్ టాటా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ లో ఏమన్నారంటే ?

తాజ్ మహల్ ప్యాలెస్ పెయింటింగ్‌తో రతన్ టాటా తన పోస్ట్‌లో  26/11 ఉగ్రవాద దాడి సమయంలో మరణించిన ప్రజలకు నివాళి అర్పించారు. సరిగ్గా ఈరోజు 12 సంవత్సరాల క్రితం జరిగిన అవాంఛనీయ విధ్వంసం ఎప్పటికీ మరచిపోలేము.

also read బ్యాంకింగ్‌ సెక్టార్ పై నిపుణుల హెచ్చరిక.. ఆమోదానికి ముందు కఠినమైన పర్యవేక్షణ అవసరం.. ...

అయితే గుర్తుండిపోయే విషయం ఏమిటంటే ముంబైలో విభిన్న వ్యక్తులతో కలిసి, అన్ని తేడాలను పక్కనపెట్టి, ఆ రోజు ఉగ్రవాదాన్ని అధిగమించాం. శత్రువులను జయించటానికి సహాయం చేసిన ధైర్యవంతుల త్యాగాన్ని గౌరవించి తీరాలి, కాని మనం మెచ్చుకోవాల్సినది ఏమిటంటే ఆరోజు వారు ప్రదర్శించిన ఐక్యత, సాహ‌సం, సున్నితత్వం భ‌విష్య‌త్తులోనూ కొనసాగాలని"రతన్ టాటా తన పోస్ట్ లో చెప్పారు.

26/11/2008 న ముంబైలో ఏమి జరిగింది?

పన్నెండు సంవత్సరాల క్రితం ఇదే రోజున ముంబైలో నాలుగు రోజుల పాటు దారుణమైన దాడి చోటుచేసుకుంది. పాకిస్తాన్ నుండి 10 మంది ఉగ్రవాదులు భారత వాణిజ్య రాజధానిపై దాడి చేశారు. ఇందులో 166 మంది మరణించగ 300 మందికి పైగా గాయపడ్డారు. మరో విషయం ఏంటంటే  ఐదు ప్రధాన ప్రదేశాలలో ఒకేసారి దాడి చేశారు.

ఈ ఉగ్రవాద దాడిలో తొమ్మిది మంది ఉగ్రవాదులు మరణించారు. మొహమ్మద్ అజ్మల్ కసాబ్‌ అనే ఉగ్రవాదిని సజీవంగా బంధించి 2012 నవంబర్‌లో ఉరితీశారు.

రతన్ టాటా ఎవరు?
రాటా టాటా 1991 నుండి 28 డిసెంబర్ 2012న పదవీ విరమణ చేసే వరకు టాటా సన్స్ గ్రూప్ ఛైర్మన్‌గా ఉన్నారు. అతను టాటా సన్స్ ఎమెరిటస్ ఛైర్మన్ కూడా.