'హ్యూమన్స్ ఆఫ్ బొంబాయి'తో మాట్లాడుతున్నప్పుడు టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి జెఆర్‌డి టాటా పదవీ విరమణ చేసిన తరువాత తాను ఎదుర్కొన్న స్వపక్షపాతం గురించి పారిశ్రామికవేత్త రతన్ టాటా కొన్ని విషయాలు చెప్పారు.

మూడు భాగాల ఇంటర్వ్యూలో  రెండవ పోస్ట్‌లో టాటా సన్స్ ఛైర్మన్ ఎమెరిటస్ మాట్లాడుతూ, "జెఆర్‌డి బంధుప్రీతి" అని అనే వారు. ఆ సమయంలో విమర్శలు అనేవి వ్యక్తిగతమైనవి.

also read ప్రయాణికులకు గుడ్ న్యూస్...ఇకపై విమానాల్లో వై-ఫై సేవలు...

రతన్ టాటా జే‌ఆర్‌డి టాటాతో తనకు ఉన్న సంబంధం గురించి మాట్లాడుతు" అతను నాకు తండ్రి, మంచి సోదరుడు లాంటివాడని చెప్పాడు."జహంగీర్ రతన్ జి దాదాభాయ్ టాటా, రతన్ టాటా టాటా కుటుంబానికి సంబంధించిన వారి నుండి వచ్చారు. జహంగీర్‌ రతన్‌జీ దాదాభాయ్‌  టాటా  టాటా గ్రూప్ ని సుమారు 50 ఏళ్ల పాటు నడిపించారు. అతని తరువాత గ్రూప్‌ వ్యాపార సామ్రాజ్య వారసుడిగా రతన్‌ టాటాని 1991లో నియమించారు.

 
 విమర్శ అనేది ఆ కాలంలో చాలా వ్యక్తిగతంగా చేసేవారు. అయితే  ఆ సమయంలో నేను ఎదురు దాడికి దిగలేదు. సంయమనం పాటించి నా పని ద్వారా నన్ను నేను నిరూపించుకోవడంపై దృష్టి సారించాను’’ అని వెల్లడించారు. అతను టాటా స్టీల్‌కు మారినప్పుడే ప్రత్యేకమైన పనులను నిర్వహించాల్సి వచ్చిందని, తన చుట్టూ పనిచేసే వ్యక్తుల దుస్థితిని అర్థం చేసుకోవడం ప్రారంభించానని చెప్పాడు.

also read సరికొత్త రికార్డు స్థాయికి చేరుకొనున్న బంగారం, వెండి ధరలు...

"అందువల్ల, సంవత్సరాల తరువాత, మేము టాటా స్టీల్‌ను 78,000 మంది నుండి 40,000 కు తగ్గించవలసి వచ్చినప్పుడు, పదవీ విరమణ రోజు వరకు వారికి వారి ప్రస్తుత వేతనాలు చెల్లించబడతాయని మేము చెప్పము. సేవ చేసే వారికి సేవ చేయడం మా డిఎన్‌ఎలో అంతర్లీనంగా ఉంది "అని అన్నాడు.

రతన్ టాటా ఇంటర్వ్యూలో జే‌ఆర్‌డి టాటా గురించి మాట్లాడుతూ "నేను అతని సన్నిహితుడిగా ఉండటం నా అదృష్టం. అతను నాకు గొప్ప గురువు, అతను నాకు తండ్రి, సోదరుడు లాంటివాడు. అతని గురించి ఇంతకంటే ఏం చెప్పలేను" అని అతను చెప్పాడు.బుధవారం షేర్ చేసిన ఈ ఫేస్‌బుక్ పోస్ట్ కి 9,000 'లైక్‌లు', వందలాది కామెంట్లు చేశారు.

 
ఈ ధారావాహిక యొక్క మొదటి భాగంలో, మిస్టర్ టాటా తన తల్లిదండ్రుల విడాకుల తరువాత, తన అమ్మమ్మతో పెరగడం, కార్నెల్ విశ్వవిద్యాలయంలో చదువుకోవడం మరియు అతను దాదాపు వివాహం చేసుకున్న సమయం గురించి చాలా కాలం మాట్లాడాడు.