న్యూ ఢీల్లీ: బజాజ్ ఫైనాన్స్ చైర్మన్ రాహుల్ బజాజ్ ఈ నెల చివరిలో తన పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించినట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. 1987లో బజాజ్ ఫైనాన్స్ ప్రారంభమైనప్పటి నుండి రాహుల్ బజాజ్ అధికారంలో ఉన్నారు.

గత ఐదు దశాబ్దాలుగా తాను వివిధ బాధ్యతల్లో  సేవలందించారు. వారసత్వ ప్రణాళికలో భాగంగా రాహుల్‌ బజాజ్  జూలై 31, 2020న తన పదవి నుంచి వైదొలగనున్నారు. అయినప్పటికీ రాహుల్‌ బజాజ్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ నాన్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా కంపెనీకి సేవలు కొనసాగిస్తాడు’’ అని కంపెనీ ఒక ప్రకటలో తెలిపింది.

ఈ విషయం తెలిపిన తరువాత స్టాక్ మార్కెట్  బిఎస్ఇలో కంపెనీ షేర్లు 6.43 శాతం తగ్గి రూ. 3,220 రూపాయలకు పడిపోయింది. ఈ రోజు జూన్ త్రైమాసిక ఫలితాలలో సంస్థ  షేర్లు నష్టాల్లో  ట్రేడవుతున్నాయి.

also read భ‌విష్య‌త్తులో టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ ఎవ‌రైనా కావొచ్చు : రతన్ టాటా ...

రాహుల్ బజాజ్ పదవి విరామణ తరువాత అతని స్థానంలో అతని కుమారుడు సంజీవ్ బజాజ్ ఆగస్టు 1 నుండి ఛైర్మన్ పదవిని చేపట్టనున్నారు. ప్రస్తుతం సంజీవ్ బజాజ్ కంపెనీ వైస్ చైర్మన్ గా ఉన్నారు.

అతను 2013 నుండి అమల్లోకి వచ్చిన బజాజ్ అల్లియన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, బజాజ్ అల్లియన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ బోర్డులకు అధ్యక్షత వహిస్తాడు. అదే సమయంలో అతను బజాజ్ హోల్డింగ్స్ & ఇన్వెస్ట్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు.

జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో బజాజ్ ఫైనాన్స్ సంవత్సరానికి 19.40 శాతం (YOY) ఏకీకృత నికర లాభం 962.32 కోట్ల రూపాయలకు పడిపోయింది. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఈ త్రైమాసికంలో ఎక్కువ భాగం లాక్ డౌన్ అమలులో ఉన్నందున క్యూ 1 ఎఫ్‌వై 21 లో సంస్థ వ్యాపార కార్యకలాపాలు గణనీయంగా ప్రభావితమయ్యాయని కంపెనీ తెలిపింది.