న్యూ ఢీల్లీ: పోస్ట్ ఆఫీసులో పెట్టుబడులు పెట్టడం చాలా సురక్షితమైనదిగా భావిస్తారు. వాటిని కేంద్ర ప్రభుత్వం నడుపుతుంది, కాబట్టి డబ్బు పోగొట్టుకోవడం వంటి వాటి గురించి ఆలోచించాల్సిన పని ఉండదు. పోస్ట్ ఆఫీస్ కస్టమర్లకు అనేక పెట్టుబడి ప్లాన్స్ అందిస్తుంది, వాటిలో ఒకటి కిసాన్ వికాస్ పత్రా.

కిసాన్ వికాస్ పత్రాలో పెట్టుబడి పెడితే మీ డబ్బు రెట్టింపు అవుతుందని పోస్ట్ ఆఫీస్ హామీ ఇస్తుంది. కిసాన్ వికాస్ పత్రా అనేది సేవింగ్ సర్టిఫికేట్ పథకం, దీనిని 1988 లో ఇండియా పోస్ట్ ప్రారంభించింది.

మీరు దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తున్నార, అయితే కిసాన్ వికాస్ పత్రా మీ కోసం ఉత్తమ ప్లాన్ అని చెప్పావచ్చు. రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేని పెట్టుబడిదారులు, కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితమైన పెట్టుబడిని కోరుకుంటారు.

ఈ ప్లాన్ లో వినియోగదారులు ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టాలి ఆ తరువాత మొత్తం డబ్బు ప్లాన్ గడువు ముగిసాక ఒకేసారి తిరిగి వస్తుంది.

also readమీ దగ్గర పాత కాయిన్స్ ఉన్నాయా.. అయితే మీరు లక్షాధికారి కావొచ్చు.. ఎలా అనుకుంటున్నారా ? ...

కిసాన్ వికాస్ పాట్రా ప్లాన్ కాలం ప్రస్తుతం 124 నెలలు. ఇందులో కనీస పెట్టుబడి 1000 రూపాయలు. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. ఇందులో వినియోగదారులకు సింగిల్ హోల్డర్ సర్టిఫికేట్, జాయింట్ ఎ ఇంకా జాయింట్ బి సర్టిఫికెట్‌తో మూడు రకాల సర్టిఫికెట్లు ఇస్తారు.

కిసాన్ వికాస్ పత్రా దరఖాస్తు ఫారాలు ఆన్‌లైన్‌లో లేదా ఇండియా పోస్ట్ ఆఫీస్‌లతో పాటు ఎంపిక చేసిన కొన్ని బ్యాంకుల్లో లభిస్తాయి. ఏదైనా ఉమ్మడి ఖాతా ఓపెన్ చేయాలనుకుంటె గరిష్టంగా 3 ఉండవచ్చు. 10 ఏళ్లు పైబడిన మైనర్లు కూడా ఈ సర్టిఫికెట్‌ను పొందవచ్చు.

కిసాన్ వికాస్ పత్రాకు ప్రస్తుతం 6.9 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఈ పథకంలో మీరు రూ.1 లక్ష మొత్తాన్ని పెట్టుబడి పెడితే, మీకు డబుల్ డబ్బు వస్తుంది, అంటే మెచ్యూరిటీతో మొత్తం రూ.2 లక్షలు. అంటే  మీ పెట్టుబడి డబ్బు 10 సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది.

మీరు ఏ తొందరపాటు లేకుండా మీ డబ్బును రెట్టింపు చేయాలనుకుంటే, ఈ పథకం మీకు రెట్టింపు లాభం ఇస్తుంది.