కరోనావైరస్ మహమ్మారి ప్రభావం కారణంగా మొత్తం ఉద్యోగులలో 10 శాతం మందిని తొలగించాలని బడ్జెట్ క్యారియర్ ఇండిగో తీసుకున్న నిర్ణయం బాధాకరమైన ప్రక్రియకు ప్రారంభమని, ప్రస్తుత పరిస్థితులలో సి‌ఏ‌పి‌ఏ(సెంటర్‌ ఫర్‌ ఏషియా పసిఫిక్‌ ఏవియేషన్‌) ఇండియా ప్రకారం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విమానయాన సంస్థలు మూతపడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది.

అంతేకాకుండా ప్రస్తుత పరిస్థితులలో థర్డ్ పార్టీ పెట్టుబడిదారులు ఏ విమానయాన సంస్థలోనూ పెట్టుబడులు పెట్టడానికి ఆవకాశాలు లేనందున, ప్రమోటర్ల నుండి మూలధన నిధులు  సమకూర్చుకోవడమే  ఏకైక మార్గమని కంపెనీల ఉన్న మార్గమని క్యాపా అభిప్రాయపడింది.

దేశీయ మార్కెట్ వాటా ద్వారా అతిపెద్ద క్యారియర్‌గా ఉన్న ఇండిగో సోమవారం ప్రయాణ పరిమితుల కారణంగా డిమాండ్ లేకపోవడంతో 23,500 మంది ఉద్యోగుల నుంచి  10 శాతం  ఉద్యోగాల కోత విధించేందుకు యోచిస్తోంది.

also read కరూర్ వైశ్యా బ్యాంక్ కొత్త ఎం.డి & సిఇఒగా రమేష్ బాబు ...

"#ఇండిగో తన సిబ్బందిలో 10 శాతం మందిని తొలగించాలని తీసుకున్న నిర్ణయం భారతీయ విమానయానానికి బాధాకరమైన ప్రక్రియకు నాంది "అని సి‌ఏ‌పి‌ఏ ఇండియా మంగళవారం ఒక ట్వీట్‌లో పేర్కొంది.

మరొక ట్వీట్‌లో పరిశ్రమ పరిస్థితుల కారణంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విమానయాన సంస్థలు మూతపడే అవకాశాలు కనిపిస్తాయని పేర్కొంది.
 

దేశీయ విమానయాన సంస్థలకు 2020-22 ఆర్థిక సంవత్సరాల్లో 1-1.3 లక్షల కోట్ల రూపాయల నష్టాన్ని అంచనా వేసిన క్రిసిల్ రీసెర్చ్ గత వారం కరోనా వైరస్  మహమ్మారి, సంబంధిత పరిమితుల కారణంగా ప్రజల రవాణా తగ్గి దేశీయ విమాన ప్రయాణీకుల రద్దీని 2020-21లో 40-45శాతం వరకు తగ్గిస్తుందని తెలిపింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంతర్జాతీయ ట్రాఫిక్ 60-65 శాతం తగ్గుతుందని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది.