పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) తాజాగా నెఫ్ట్, ఆర్టీజీఎస్ ఛార్జీలను పెంచింది. మే 20వ తేదీ నుండి ఈ పంపు అమలులోకి వచ్చినట్లు మంగళవారం నాడు వెల్లడించింది. 

పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) తాజాగా నెఫ్ట్ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్సుఫర్), ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్) ఛార్జీలను పెంచింది. మే 20వ తేదీ నుండి ఈ పంపు అమలులోకి వచ్చినట్లు మంగళవారం నాడు వెల్లడించింది. అలాగే, నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (NACH) ఈ-మ్యాండేట్ ఛార్జీలను కూడా బ్యాంకు సవరించింది. ఈ ఛార్జీలను రూ.100గా నిర్ణయించింది. మే 28వ తేదీ నుండి ఇది అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. పెరిగిన ఛార్జీలకు జీఎస్టీ అదనం.

గతంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ.2 లక్షల నుండి రూ.5 లక్షల మొత్తం ఆర్టీజీఎస్ పైన బ్యాంకు బ్రాంచీలో అయితే రూ.20, ఆన్‌లైన్ అయితే సున్నా ఛార్జీలు వసూలు చేసింది. అయితే ఇప్పుడు బ్యాంకులో అయితే రూ.24.50, ఆన్ లైన్ అయితే రూ.24.00 వసూలు చేస్తోంది.రూ.5 లక్షలకు పైన ఆర్టీజీఎస్ ఛార్జీలను బ్రాంచీలో అయితే రూ.40, ఆన్ లైన్ అయితే సున్నా వసూలు చేసింది. ఇప్పుడు బ్రాంచీలో రూ.49.50, ఆన్ లైన్ అయితే రూ.49 వసూలు చేస్తోంది.

పంజాబ్ నేషనల్ బ్యాంకు నెఫ్ట్ ట్రాన్సాక్షన్ ఛార్జీలు రూ.10,000 వరకు బ్యాంకులో అయితే రూ.2000, ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ జీరోగా ఉంది. ఇక నుండి బ్యాంకులో అయితే రూ.2.25, ఆన్ లైన్ ట్రాన్సాక్షన్ అయితే రూ.1.75 అవుతుంది. రూ.10,000 నుండి రూ.1,00,000 అయితే ఇదివరకు బ్యాంకులో ఛార్జీ రూ.4, ఆన్ లైన్ జీరోగా ఉండేది.

ఇప్పుడు బ్యాంకులో రూ.4.75, ఆన్ లైన్ అయితే రూ.4.25గా ఉంది. రూ.1 లక్ష నుండి రూ.2 లక్షల వరకు బ్యాంకులో ఇదివరకు రూ.14, ఆన్ లైన్ ఛార్జీ జీరోగా ఉంది. ఇక నుండి బ్యాంకులో రూ.14.75, ఆన్ లైన్ అయితే రూ.14.25గా ఉంటుంది. రూ.2 లక్షలకు పైన బ్యాంకు ట్రాన్సాక్షన్ అయితే ఇది వరకు రూ.24 ఉండగా, ఇప్పుడు రూ.24.75కు పెరిగింది. ఆన్ లైన్ ఛార్జీ రూ.24.25కు పెరిగింది. ఇక నాచ్ ఛార్జీలు రూ.100గా ఉంది.