న్యూ ఢీల్లీ: భారతదేశంలోని మొట్టమొదటి డ్రైవర్‌లెస్ మెట్రోను ప్రధాని నరేంద్రమోడి ప్రారంభించారు. ఢీల్లీ మెట్రో మెజెంటా లైన్ (జనక్‌పురి వెస్ట్-బొటానికల్ గార్డెన్) తో పాటు ఎయిర్ పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌లో పనిచేసే నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ఎన్‌సిఎంసి) సేవలను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభించారు.

మొదటి డ్రైవర్‌లెస్ మెట్రో రైలు ప్రారంభోత్సవం స్మార్ట్ సిస్టమ్స్ వైపు భారత్ ఎంత వేగంగా పయనిస్తుందో చూపిస్తుందని, అలాగే దేశంలో మొట్టమొదటి మెట్రోను అటల్ జీ  ప్రారంభించారు. 2014లో మా ప్రభుత్వం ఏర్పడినప్పుడు, కేవలం ఐదు నగరాల్లో మాత్రమే మెట్రో సేవలు ఉండగా, నేడు 18 నగరాలలో మెట్రో సేవలు ఉన్నాయి.

2025 నాటికి మేము దీనిని 25కి పైగా నగరాలకు విస్తరిస్తాము, "అని అన్నారు. డ్రైవర్‌లెస్ మెట్రో ఆపరేషన్‌తో ఢీల్లీ మెట్రో ప్రపంచంలోని ప్రముఖ మెట్రో సర్వీసులో చేర్చనున్నట్లు డిఎంఆర్‌సి తెలిపింది. జూన్ 2021 నాటికి పింక్ లైన్ (మజ్లిస్ పార్క్-శివ్ విహార్) లో 57 కిలోమీటర్ల డ్రైవర్‌లెస్ మెట్రోను ప్రయోగించాలని భావిస్తున్నారు.

also read మీరు పాస్‌పోర్ట్ కోసం అప్లయ్ చేస్తున్నారా జాగ్రత్త.. వీటి గురించి తెలుసుకోండి.. లేదంటే ? ...

దీని ద్వారా ప్రయాణీకులకు డ్రైవర్‌లెస్ మెట్రోలో 94 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డ్రైవర్‌లెస్ మెట్రో నెట్‌వర్క్‌లో ఇది 7 శాతం ఉంటుంది. ఈ మెట్రో సర్వీస్ పూర్తిగా ఆటోమేటెడ్. ఇది మానవ జోక్యాన్ని తగ్గించడమే కాక, అతితక్కువ లోపాల  అవకాశాలు కూడా ఉంటుంది.

నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ఎన్‌సిఎంసి) లభ్యత కూడా మెట్రోకు పెద్ద సాధన అవుతుంది. ఈ సేవను ప్రవేశపెట్టడంతో మీరు దేశంలోని ఏ మూల నుండి అయినా రూ-పే కార్డుతో ఎయిర్ పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మార్గంలో ప్రయాణించవచ్చు. 2022 నాటికి, ప్రయాణికులకు కామన్ మొబిలిటీ కార్డుతో అన్ని మెట్రో మార్గాల్లో ప్రయాణించే అవకాశం లభిస్తుంది.

మెజెంటా లైన్‌తో జనక్‌పురి నుండి నోయిడా బొటానికల్ గార్డెన్స్ వరకు డ్రైవర్‌లెస్ మెట్రో సేవలను ప్రవేశపెట్టడం వల్ల ప్రయాణికులకు  గణనీయమైన ఉపశమనం లభిస్తుంది. ఈ కారిడార్‌ మార్గంలో లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు, వీరిలో ఎక్కువ మంది ఐటి కంపెనీలతో సహా నోయిడాలోని ప్రముఖ కంపెనీలలో పనిచేస్తున్నా వారు ఉన్నారు.