PM Kisan Yojana: పీఎం కిసాన్ పథకం ద్వారా దేశంలోని సన్నకారు రైతులకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు, ప్రతి రైతు బ్యాంకు ఖాతాలో నేరుగా DBT పద్ధతిలో ఏడాదికి రూ.6 వేల జమ అవుతున్నాయి. అయితే ఈ నిధులను ఒక్క సారే కాకుండ మూడు విడతల్లో విడుదల చేస్తున్నారు. ప్రతీ 4 నెలలకు ఒకసారి  రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో ఈ డబ్బు జమ అవుతుంది. 

రైతుల అభ్యున్నతి కోసం ప్రధాని మోదీ ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నారు. ఇందులో భాగంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏటా 6 వేల రూపాయలను అందిస్తున్నారు. ఈ డబ్బును నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతున్నాయి. ఇప్పటికే 10 విడతలుగా నిధులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి.

ఇదిలా ఉంటే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు (PM Kisan Samman Nidhi) సంబంధించిన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం మార్చింది. పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్‌లో అవకతవకలను నివారించడానికి, ఇప్పుడు రేషన్ కార్డును తప్పనిసరి చేశారు. రేషన్ కార్డ్ నంబర్ వచ్చిన తర్వాత మాత్రమే, రైతు కుటుంబానికి చెందిన రేషన్ కార్డు ప్రకారం భర్త లేదా భార్య లేదా ఆ కుటుంబంలోని ఎవరైనా సభ్యుడు PM కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క ప్రయోజనాన్ని పొందగలరు. ఈ పథకం కింద, కొత్త రిజిస్ట్రేషన్‌పై రేషన్ కార్డు నంబర్ నమోదు చేయడం తప్పనిసరి. ఇది కాకుండా, రేషన్ కార్డు సాఫ్ట్ కాపీని తయారు చేసి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

రిజిస్ట్రేషన్ కోసం కావాల్సిన పత్రాలు ఇవే...
మీరు PM కిసాన్ యోజన (PM Kisan Yojana) కింద మొదటిసారి నమోదు చేసుకుంటే, దరఖాస్తుదారు రేషన్ కార్డ్ నంబర్‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా పీడీఎఫ్ కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పట్టాదారు పత్రం, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్, డిక్లరేషన్ హార్డ్ కాపీల తప్పనిసరి సమర్పణ రద్దు చేశారు. ఇప్పుడు పత్రాల PDF ఫైల్‌లను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. దీని వల్ల పీఎం కిసాన్ యోజనలో జరిగే అవకతవకలను నివారించవచ్చని కేంద్ర ఆర్థిక శాఖ గుర్తించింది. అలాగే రిజిస్ట్రేషన్ కూడా మునుపటి కంటే సులువుగా మారనుంది. 

పీఎం కిసాన్ (PM Kisan Samman Nidhi Yojana) పథకం కింద 11వ విడతను ఏప్రిల్‌లో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రైతుల ఖాతాల్లో వాయిదాల బదిలీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. 11వ విడత సద్వినియోగం చేసుకునేందుకు రైతులు ముందుగానే ఈ పథకంలో నమోదు చేసుకోవాలి.

ప్రభుత్వం రైతులకు ఏటా 6000 రూపాయలు ఇస్తుంది
పీఎం కిసాన్ యోజన కింద దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఏటా 6 వేల రూపాయలు అందుతున్నాయి. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఆన్‌లైన్‌లో రైతుల ఖాతాలకు జమ చేస్తుంది. మీరు కూడా రైతులే అయినప్పటికీ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే ఆందోళన చెందాల్సిన పనిలేదు. మీరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధిలో (PM Kisan Samman Nidhi Yojana) మీ పేరును కూడా నమోదు చేసుకోవచ్చు, తద్వారా మీరు ప్రభుత్వ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

పూర్తి వివరాల కోసం PM కిసాన్ యోజన (PM Kisan Yojana) ఇక్కడ క్లిక్ చేయండి..