ప్రముఖ వ్యాపారవేత్త, పిజ్జా హట్ సహ వ్యవస్థాపకుడు ఫ్రాంక్ కార్నే(82) న్యుమోనియాతో మరణించారు. తన సోదరుడితో కలిసి విచితాలో పిజ్జా హట్ సామ్రాజ్యాన్ని ప్రారంభించిన ఫ్రాంక్ కార్నె న్యుమోనియాతో ఆరోగ్యం విషమించడంతో బుధవారం తుది శ్వాస విడిచారు.

ఇటీవల కోవిడ్-19 నుండి కోలుకున్నా ఫ్రాంక్ కార్నే కొంతకాలంగా అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నారు. అతను విచితలోని ఆసిస్టెడ్ లివింగ్ ఫెసిలిటీలో తెల్లవారుజామున 4:30 గంటలకు మరణించినట్లు అతని భార్య, సోదరుడు  ప్రకటించారు.

19 ఏళ్ల వయస్సులో ఫ్రాంక్ కార్నీ విచిత స్టేట్ యూనివర్శిటీలో విద్యార్థిగా ఉన్నప్పుడు అతను, అతని 26 ఏళ్ల సోదరుడు డాన్ కలిసి 1958లో వారి తల్లి నుండి 600 డాలర్లు అప్పుగా తీసుకుని పిజ్జా వ్యాపారం ప్రారంభించారు.

also read స్పైస్ బ్రాండ్ ఎండిహెచ్ మసాలా యజమాని 'మసాలా కింగ్' ధరంపాల్ గులాటి ఇకలేరు ...  

పెప్సికో 1977లో పిజ్జా హట్‌ను 300 మిలియన్లకు కొనుగోలు చేసింది. ఆ తరువాత  ఇతర ఆహార సంస్థలు, రియల్ ఎస్టేట్, ఆయిల్ అండ్ గ్యాస్, ఆటోమోటివ్, వినోద వ్యాపారాలతో సహా వివిధ వ్యాపార సంస్థలలో  పెట్టుబడులు పెట్టారు.

సుమారు 20 కంపెనీలలో ఐదు మాత్రమే అతనికి డబ్బు సంపాదించి పెట్టాయి. ఫ్రాంక్ కార్నె పాపా జాన్ అతిపెద్ద ఫ్రాంచైజీలలో ఒకరు. 

వారి తల్లిదండ్రుల నుంచి  అప్పుగా తీసుకున్న 600 డాలర్లతో ప్రారంభించిన సంస్థ అంచలంచెలుగా వృద్ధిని సాధించి దిగ్గజ సంస్థగా అవతరించింది. తరువాత వివిధ దేశాలకు విస్తరించింది.