తెలంగాణ హైదరాబాద్‌లో మంగళవారం పెట్రోల్ ధర పెరిగింది. 90 పైసలు పైకి చేరింది. దీంతో పెట్రోల్ ధర లీటరుకు రూ. 113.61కు ఎగసింది. డీజిల్ రేటు కూడా ఇదే దారిలో నడిచింది. డీజిల్ ధర 76 పైసలు పైకి చేరింది. దీంతో దీని రేటు లీటరుకు రూ. 99.84కు పెరిగింది.

పెట్రోల్, డీజిల్ ధరలు మంగళ‌వారం (మార్చి 29, 2022) మ‌రోసారి పెరిగాయి. మంగళ‌వారం ఆయిల్ కంపెనీలు మ‌రోసారి వాహ‌న‌దారుల‌కు షాకిచ్చాయి. వ‌రుస‌గా ఎనిమిది రోజుల్లో పెట్రోల్ ధ‌ర‌లు పెర‌గడం ఇది ఏడోసారి. చ‌మురు సంస్థలు లీట‌ర్ పెట్రోల్‌పై 90 పైస‌లు, డీజిల్‌పై 76 పైస‌లు చొప్పున పెంచారు. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ రూ. 113.61, డీజిల్ రూ. 99.84గా ఉంది. ఇక ఇప్ప‌టివ‌ర‌కు పెట్రోల్‌పై రూ. 4.80, డిజీల్‌పై రూ. 4.80 చొప్పున పెరిగాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు ఇటీవల భారీగా పెరిగి, ఆ తర్వాత కాస్త శాంతించాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లుగా కనిపించడంతో ధరలు కాస్త క్షీణించాయి.

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL) చమురు ధరలకు సంబంధించి మంగళ‌వారం (మార్చి 29, 2022) కొత్త ధరలను విడుదల చేశాయి. మంగళ‌వారం పెట్రోల్‌పై 90 పైస‌లు, డీజిల్‌పై 76 పైస‌లు పెరిగాయి. సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల పైకి, కిందకు కదులుతున్నాయి. ఈ ప్రభావం దేశీయంగా పెట్రోల్, డీజిల్ పైన ఉంటుంది.

పెట్రోల్‌, డీజిల్ ధరలివే..!

- దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 100.21 కాగా, డీజిల్‌ రూ. 91.47 వద్ద కొనసాగుతోంది.

- దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 115.04 కాగా, డీజిల్‌ రూ. 99.25గా ఉంది.

- చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 105.94 కాగా, డీజిల్ రూ. 96.00గా నమోదైంది.

- బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ. 105.62 కాగా, డీజిల్‌ రూ. 89.70 వద్ద కొనసాగుతోంది.

- కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 109.68 కాగా, డీజిల్ ధర లీటర్ కు రూ. 94.62గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..!

- హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 113.61 వద్ద కొనసాగుతుండగా, డీజిల్‌ రూ. 99.84గా ఉంది.

- విజ‌య‌వాడ‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 115.52కాగా, డీజిల్‌ రూ. 101.36కి చేరింది.

- గుంటూరు అమరావతిలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 115.57కాగా, డీజిల్‌ రూ. 101.43కి చేరింది.

పెట్రోల్-డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతాయి. ఉదయం 6 గంటలకు సవరిస్తారు. మీరు రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు (How to check diesel petrol price daily). ఇండియన్ ఆయిల్ కస్టమర్లు సిటీ కోడ్‌తో పాటు RSPని 9224992249కి పంపడం ద్వారా, BPCL కస్టమర్‌లు RSPని 9223112222 నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అదే సమయంలో, HPCL వినియోగదారులు HP Price అని టైప్ చేసి 9222201122 నంబర్‌కు మెసేజ్ పంపడం ద్వారా ధరను తెలుసుకోవచ్చు.