గత కొన్ని రోజులుగా నిలకడగా ఉన్న పెట్రోల్‌, డీజిల్ ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. దాదాపు నాలుగున్నర నెలల తర్వాత మళ్లీ ధరలు ఎగబాకుతున్నాయి. రెండు రోజులు నుంచి పెట్రోల్‌, డీజిల్‌  ధరలు పెరగడం ప్రారంభమైంది. 

అందరూ అనుకున్నట్లుగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే వెళ్తున్నాయి. వరుసగా రెండో రోజు కూడా ఇంధన ధరలు పెరిగాయి. వాహనదారులకు ఇది బ్యాడ్ న్యూస్. మంగ‌ళ‌వారం 80 పైసలుపైన పెరిగిన ధరలు బుధ‌వారం కూడా దాదాపు అదే స్థాయిలో పైకి చేరాయి. పెట్రోల్‌పై 90 పైస‌లు, డీజిల్‌పై 87 పైస‌లు పెరిగింది. 

హైదరాబాద్‌లో బుధవారం (మార్చి 23, 2022) పెట్రోల్ ధర 91 పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్ ధర లీటరుకు రూ. 110కి చేరింది. డీజిల్ రేటు కూడా ఇదే దారిలో నడిచింది. డీజిల్ ధర లీటరుకు 87 పైసలుపైకి చేరింది. దీంతో దీని రేటు రూ. 96.36కు ఎగసింది. ఏపీ గుంటూరు అమరావతిలో కూడా పెట్రోల్ ధర ఇదే దారిలో నడిచింది. పెట్రోల్ రేటు లీటరుకు 87 పైసలు పెరిగింది. రూ. 112.08కు చేరింది. డీజిల్ రేటు కూడా 84 పైసలు పెరిగింది. దీంతో డీజిల్ ధర రూ. 98.10కు ఎగసింది.

పెట్రోల్‌, డీజిల్ ధరలివే..!

- దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 97.01 కాగా, డీజిల్‌ రూ. 88.27 వద్ద కొనసాగుతోంది.

- దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 111.67 కాగా, డీజిల్‌ రూ. 95.85గా ఉంది.

- చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 102.91 కాగా, డీజిల్ రూ. 92.95గా నమోదైంది.

- బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ. 102.26 కాగా, డీజిల్‌ రూ. 86.58 వద్ద కొనసాగుతోంది.

- కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 106.34 కాగా, డీజిల్ ధర లీటర్ కు రూ. 91.42గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..!

- హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 110 వద్ద కొనసాగుతుండగా, డీజిల్‌ రూ. 96.36గా ఉంది.

- గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 112.08 కాగా, డీజిల్‌ రూ. 98.10గా ఉంది.

పెట్రోల్-డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతాయి. ఉదయం 6 గంటలకు సవరిస్తారు. మీరు రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు (How to check diesel petrol price daily). ఇండియన్ ఆయిల్ కస్టమర్లు సిటీ కోడ్‌తో పాటు RSPని 9224992249కి పంపడం ద్వారా, BPCL కస్టమర్‌లు RSPని 9223112222 నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అదే సమయంలో, HPCL వినియోగదారులు HP Price అని టైప్ చేసి 9222201122 నంబర్‌కు మెసేజ్ పంపడం ద్వారా ధరను తెలుసుకోవచ్చు.