వాహనదారులకు బ్యాడ్ న్యూస్. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. చాలా నెలల తర్వాత అంటే దాదాపు 137 రోజుల తర్వాత రేట్లు పెరగడం ఇదే తొలిసారి. కేంద్ర ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేస్తుందని చాలా మంది భావించారు. ఇప్పుడు అదే జరిగింది. 

గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫ‌లితాల త‌ర్వాత‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగలేదు. దాదాపు నాలుగున్నర నెలలుగా ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు కనిపించలేదు. కానీ తాజాగా ఒక్కసారిగా మళ్లీ ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ (Crude Oil) ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో చమురు సంస్థలు ఇంధన ధరలను పెంచేశాయి. ఈ క్రమంలోనే తాజాగా మంగళవారం (మార్చి 22, 2022) ధరలను పెంచుతూ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ నిర్ణయం తీసుకుంది.

పెరిగిన ధరలు మంగళవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశంలోని పలు నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో పెరుగుదల కనిపించింది. ఏకంగా ఒకేసారి పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 88 పైసలు పెరిగాయి. మంగళవారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..!

పెట్రోల్‌, డీజిల్ ధరలివే..!

- దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 96.21 కాగా, డీజిల్‌ రూ. 87.47 వద్ద కొనసాగుతోంది.

- దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 110.82 కాగా, డీజిల్‌ రూ. 95గా ఉంది.

- చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 102.16 కాగా, డీజిల్ రూ. 92.19గా నమోదైంది.

- బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ. 101.42 కాగా, డీజిల్‌ రూ. 85.80 వద్ద కొనసాగుతోంది.

- కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 105.51 కాగా, డీజిల్ ధర లీటర్ కు రూ. 90.62గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..!

దాదాపు 5 నెల‌ల త‌ర్వాత తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరిగాయి. తెలంగాణ‌లో లీట‌ర్ పెట్రోల్‌పై 90 పైస‌లు, డీజిల్‌పై 87 పైస‌లు పెరిగింది. ఏపీలో లీట‌ర్ పెట్రోల్‌పై 88 పైస‌లు, డీజిల్‌పై 83 పైస‌లు పెరిగింది. 

- హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 109.10 వద్ద కొనసాగుతుండగా, డీజిల్‌ రూ. 95.49గా ఉంది.

- విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 110.80 కాగా, డీజిల్‌ రూ. 96.83 వద్ద కొనసాగుతోంది.

- విశాఖపట్నంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 109.93 కాగా, డీజిల్‌ రూ. 95.41గా ఉంది.

- గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 111.21 కాగా, డీజిల్‌ రూ. 97.26గా ఉంది.

పెట్రోల్-డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతాయి. ఉదయం 6 గంటలకు సవరిస్తారు. మీరు రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు (How to check diesel petrol price daily). ఇండియన్ ఆయిల్ కస్టమర్లు సిటీ కోడ్‌తో పాటు RSPని 9224992249కి పంపడం ద్వారా, BPCL కస్టమర్‌లు RSPని 9223112222 నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అదే సమయంలో, HPCL వినియోగదారులు HP Price అని టైప్ చేసి 9222201122 నంబర్‌కు మెసేజ్ పంపడం ద్వారా ధరను తెలుసుకోవచ్చు.