Asianet News TeluguAsianet News Telugu

Petrol Diesel Prices: మే 25న తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే...చెక్ చేసుకోండి...

Petrol Diesel Prices : ఒకవైపు పెట్రోలు, డీజిల్‌పై పన్నును తగ్గించి ప్రజలకు గొప్ప ఊరటనిచ్చిన కేంద్ర ప్రభుత్వానికి మరోవైపు పెరుగుతున్న ముడిచమురు ధరలు సవాలు విసురుతున్నాయి. ముడి చమురు భారం కావడంతో ధరలు పెంచాలంటూ ఒక వైపు పెట్రోలియం కంపెనీలు ఒత్తిడి తెస్తున్నాయి. అయితే ప్రభుత్వ రంగ పెట్రోలియం కంపెనీలు బుధవారం విడుదల చేసిన ధరల్లో ఎలాంటి మార్పులు లేకపోవడం గమనార్హం.

petrol diesel prices today 25 may 2022 check latest rate with full list
Author
Hyderabad, First Published May 25, 2022, 9:10 AM IST

Petrol Diesel Prices: గత శనివారం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన తర్వాత బుధవారం మే 25న కూడా పెట్రోల్, డీజిల్ ధరలను OMCలు స్థిరంగానే ఉంచాయి. పెట్రోలుపై ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు 8, డీజిల్‌పై లీటరుకు 6 రూపాయలు తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రకటించారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర గత వారం రూ.105.41 ఉండగా, ప్రస్తుతం రూ.96.72గా ఉంది, డీజిల్ ధర ప్రస్తుతం రూ.89.62గా ఉంది. 

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే, హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరల్లో బుధవారం ఎలాంటి మార్పు లేదు. లీటర్ పెట్రోల్ రేటు రూ. 109.64 వద్ద కొనసాగుతోంది. డీజిల్ రేటు లీటరుకు రూ. 97.8 వద్ద ఉంది. ఇక ఏపీ రాజధాని ప్రాంతమైన విజయవాడ, గుంటూరులో పెట్రోల్, డీజిల్ రేట్లు రూ. 111.74గా, రూ. 99.49గా ఉన్నాయి.

ఇదిలా ఉంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) మరియు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సహా ప్రభుత్వ రంగ OMCలు బెంచ్‌మార్క్ అంతర్జాతీయ ధరలు మరియు విదేశీ మారకపు ధరలకు అనుగుణంగా ఇంధన ధరలను ప్రతిరోజూ సవరిస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి అమలులోకి వస్తాయి. వ్యాట్ లేదా సరుకు రవాణా ఛార్జీల వంటి స్థానిక పన్నుల కారణంగా రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి. ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ మరియు డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాయి.

కేరళ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై లీటరుకు రూ.2.41, రూ.1.36 చొప్పున పన్ను తగ్గింపును ప్రకటించింది. రాజస్థాన్ ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ.2.48, డీజిల్‌పై రూ.1.16 వ్యాట్‌ను తగ్గించింది. మహారాష్ట్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ.2.08, డీజిల్‌పై రూ.1.44 చొప్పున వ్యాట్‌ను తగ్గించింది. ఒడిశా ప్రభుత్వం కూడా లీటర్ పెట్రోల్‌పై రూ.2.23, డీజిల్‌పై రూ.1.36 చొప్పున పన్నులను తగ్గించింది.

ముడి చమురు ధర
పెట్టుబడిదారులు గట్టి సరఫరా మరియు పెరిగిన డిమాండ్‌ను అంచనా వేయడంతో బుధవారం ఉదయం చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 46 సెంట్లు పెరిగి 114.02 డాలర్లకు చేరుకోగా, U.S. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఫ్యూచర్స్ 58 సెంట్లు పెరిగి బ్యారెల్ 110.35 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.

నేటి తాజా ధరను మీరు ఇలా తెలుసుకోవచ్చు
మీరు SMS ద్వారా పెట్రోల్ డీజిల్ రోజువారీ రేటును కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్లు RSPని 9224992249 నంబర్‌కు, BPCL వినియోగదారులు RSPని 9223112222 నంబర్‌కు పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అదే సమయంలో, HPCL వినియోగదారులు HPPriceని 9222201122 నంబర్‌కు పంపడం ద్వారా ధరను తెలుసుకోవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios