తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 14న గురువారం ఇంధన ధరలు నిలకడగానే ఉన్నాయి. దీంతో గత ఎనిమిది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు లేదని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పెట్రోల్ ధ‌ర‌ లీటర్‌కు రూ.119.49 వద్ద కొనసాగుతోంది. ఇక డీజిల్ విషయానికి వస్తే లీటర్‌కు రూ.105.49 వ‌ద్ద ఉంది. 

గురువారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. దేశీ ఇంధన ధరలు నిలకడగా ఉండ‌టం ఇది వరుసగా 8వ రోజు కావడం గమనార్హం. వాహనదారులకు ఇది భారీ ఉపశమనం. అయితే పెట్రోల్, డీజల్ రేట్లు ఈ నెలలో ఇప్పటి దాకా చూస్తే లీటరుకు రూ.3.6 మేర పైకి చేరింది. గత నెలలో ఇంధ‌న‌ రేట్లు రూ.6.4 మేర పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. కాగా హైదరాబాద్‌లో నేటి రేట్ల విషయానికి వస్తే.. పెట్రోల్ రూ.119.49 వద్ద, డీజిల్ రూ.105.49 వద్ద ఉన్నాయి. విజయవాడలో లీటర్‌ పెట్రోల్ ధర నేడు రూ.121.28గా ఉంది. డీజిల్ లీట‌ర్‌ రూ.106.89 వ‌ద్ద‌ ఉంది. 

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL) చమురు ధరలకు సంబంధించి గురువారం (ఏప్రిల్ 14, 2022) కొత్త ధరలను విడుదల చేశాయి. దేశీయంగా గురువారం కూడా ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి. సాధారణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల పైకి, కిందకు కదులుతున్నాయి. ఈ ప్రభావం దేశీయంగా పెట్రోల్, డీజిల్ పైన ఉంటుంది.

పెట్రోల్‌, డీజిల్ ధరలివే..!

- దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 105.41 కాగా, డీజిల్‌ రూ. 96.67 వద్ద కొనసాగుతోంది.

- దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 120.51 కాగా, డీజిల్‌ రూ. 104.77గా ఉంది.

- చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 110.85 కాగా, డీజిల్ రూ. 100.94గా నమోదైంది. 

- బెంగళూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ. 111.09 కాగా, డీజిల్‌ రూ. 94.79 వద్ద కొనసాగుతోంది.

- కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటర్ కు రూ. 115.12 కాగా, డీజిల్ ధర లీటర్ కు రూ. 99.83గా ఉంది. 

తెలుగు రాష్ట్రాల్లో ధరలు..!

- హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 119.49 వద్ద కొనసాగుతుండగా, డీజిల్‌ రూ. 105.49గా ఉంది.

- విజ‌య‌వాడ‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ. 121.28కాగా, డీజిల్‌ రూ. 106.89గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగినందున ధరలు మరింత ఎగుస్తాయని అంచనాలున్నాయి. దీంతో దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగి, గ్రోత్‌పై ప్రభావం చూపనుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారతదేశం ఎక్కువగా పెట్రోల్, డీజిల్ అవసరాలపై ఇతర దేశాలపైనే ఆధారపడుతోంది. పెట్రోల్-డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతాయి. ఉదయం 6 గంటలకు సవరిస్తారు.

మీరు రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు (How to check diesel petrol price daily). ఇండియన్ ఆయిల్ కస్టమర్లు సిటీ కోడ్‌తో పాటు RSPని 9224992249కి పంపడం ద్వారా, BPCL కస్టమర్‌లు RSPని 9223112222 నంబర్‌కు మెసేజ్ చేయడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అదే సమయంలో, HPCL వినియోగదారులు HP Price అని టైప్ చేసి 9222201122 నంబర్‌కు మెసేజ్ పంపడం ద్వారా ధరను తెలుసుకోవచ్చు.