పెట్రోలు, డీజిల్‌ ధరలను   మరోసారి  చమురు కంపెనీలు పెంచాయి. దీంతో నేడు పెట్రోలు, డీజిల్‌ ధరలపై లీటరుకు 29 పైసలు పెంచుతున్నట్టు ప్రకటించాయి.  

దేశంలో ఇంధన ధరల పెంపు కొనసాగుతుంది. ఒక రోజు విరామం తరువాత నేడు ప్రభుత్వ-చమురు మార్కెటింగ్ సంస్థలు శుక్రవారం ఇంధన ధరలను భారీగా సవరించాయి. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను 28-29 పైసలు పెంచారు.

తాజా పెంపు తరువాత పెట్రోల్ ధర ఢీల్లీలో లీటరుకు రూ.95.85, డీజిల్ ధర లీటరుకు రూ.86.75 చేరింది. ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ.102 దాటింది, డీజిల్ ధర లీటరుకు రూ .94 పెరిగింది.

ఇక దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా రిటైల్ అవుతున్నాయి.దేశంలో పెట్రోల్ ధర అత్యధికంగా లీటరుకు రూ.106 చేరగా, డీజిల్ ధర లీటరుకు రూ.99 దాటింది. గత 38 రోజుల్లో ఇంధన ధరలు 23 సార్లు పెంపు చేశారు. అలాగే ఒక్క జూన్‌ నెలలో పెట్రోల్ ధర రూ. 1.36 పైసలు పెరిగింది.

ప్రపంచ ముడి చమురు ధరలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ చమురు కంపెనీలు ఇంధన ధరలను పెంచుతుండగా, ఇది ఆర్థిక పునరుద్ధరణను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

also read ఏటీఎం వినియోగదారులకు RBI షాక్.. ఇంటర్ ఛేంజ్ ఫీజు పెంపు.. ...

కోవిడ్ -19 కారణంగా భారతదేశ చమురు డిమాండ్ బాగా పడిపోయిందని డేటా సూచిస్తుంది, అయితే అధిక ఇంధన ధరలు పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. కరోనా మహమ్మారి ప్రధానంగా డిమాండ్‌ను ప్రభావితం చేసినప్పటికీ, పెరుగుతున్న ధరలు ప్రజలను ఇంధన కొనుగోళ్లను పరిమితం చేస్తాయని నిపుణులు భావిస్తున్నారు.

పెట్రోల్, డీజిల్ ధరలపై ఆధారపడి తక్కువ ఆదాయాన్ని సంపాదించేవారిని ఇంధన ధరల వరుస పెంపు తీవ్రంగా ప్రభావితం చేస్తుందని వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలపై రాష్ట్ర, కేంద్ర పన్నులు కనీసం 60 శాతం ఉన్నాయి.


పెట్రోల్, డీజిల్ తాజా ధర

నగరం పెట్రోల్ డీజిల్ 
న్యూఢిల్లీ 95.85 86.75
ముంబై 102.04 94.15
కోల్‌కతా 95.80 89.60
చెన్నై 97.19 91.42
హైదరాబాదు 99.31 94.26

తాజా పెంపుతో హైదరాబాద్‌లో పెట్రోలో ధర సెంచరీ దాటనుంది. ఇప్పటికే ఆంధరప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోలు ధరలు వందను దాటేశాయి. ధరల పెరుగుదల ఇలానే కొనసాగితే డీజిల్‌ ధర కూడా వంద మార్కు దాటే అవకాష్మ ఉంది.