Asianet News TeluguAsianet News Telugu

పెట్రోల్ డీజిల్ ధరల అప్‌డేట్: నేడు లీటరు ధర పెరిగిందా తగ్గిందా తెలుసుకోండి..

భారతదేశంలో పెట్రోలు, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేకుండా నేడు వరుసగా 213వ రోజు. దీంతో ద్రవ్యోల్బణం విషయంలో సామాన్యులకు కొంత ఊరట లభించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర తగ్గుముఖం పట్టింది. WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు $78కి, బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $85కి పడిపోయింది.
 

Petrol Diesel Price Update today: Latest fuel  prices announced know details here
Author
First Published Dec 19, 2022, 9:35 AM IST

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర పడిపోతున్న నేపథ్యంలో భారతీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నేడు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను విడుదల చేశాయి. అయితే, భారతీయ చమురు కంపెనీలు సోమవారం (డిసెంబర్ 19) పెట్రోల్, డీజిల్ ధరలను స్థిరంగా ఉంచాయి.

భారతదేశంలో పెట్రోలు, డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేకుండా నేడు వరుసగా 213వ రోజు. దీంతో ద్రవ్యోల్బణం విషయంలో సామాన్యులకు కొంత ఊరట లభించింది.

నేడు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర తగ్గుముఖం పట్టింది. WTI క్రూడ్ ధర బ్యారెల్‌కు $78కి, బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు $85కి పడిపోయింది.

అంతకుముందు మే 21న ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున తగ్గింది. అప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. కేంద్రం ప్రకటన తర్వాత రాజస్థాన్, మహారాష్ట్ర, ఒడిశా, కేరళ ప్రభుత్వాలు కూడా పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ని తగ్గించాయి.

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27. కోల్‌కతాలో పెట్రోలు ధర రూ.106.03, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. మరోవైపు చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉంది.

రాజస్థాన్‌లోని గంగానగర్‌, హనుమాన్‌గఢ్‌ జిల్లాల్లో  పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అత్యధికంగా ఉన్నాయి. గంగానగర్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.113.48, డీజిల్‌ ధర రూ.98.24. హనుమాన్‌గఢ్‌ జిల్లాలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.112.54కు, డీజిల్‌ ధర రూ.97.39గా ఉంది.

పోర్ట్ బ్లెయిర్‌లో పెట్రోల్ ధర అతితక్కువకు ధరకు అంటే లీటరుకు రూ. 84.10, డీజిల్ ధర లీటరుకు రూ.79.74కి లభిస్తుంది.

నేటి పెట్రోల్ డీజిల్ ధరలు ఎంతంటే?

హైదరాబాద్: లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82.

బెంగళూరు: లీటర్ పెట్రోల్ ధర రూ.101.94, డీజిల్ ధర రూ.87.89.

తిరువనంతపురం: లీటర్ పెట్రోల్ ధర రూ.107.71, డీజిల్ ధర రూ.96.52.

భువనేశ్వర్: లీటర్ పెట్రోల్ ధర రూ.103.19, డీజిల్ ధర రూ.94.76.

చండీగఢ్: లీటర్ పెట్రోల్ ధర రూ.96.20, డీజిల్ ధర రూ.84.26.

లక్నో: లీటర్ పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.76.

నోయిడా: లీటర్ పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.96.

జైపూర్: లీటర్ పెట్రోల్ ధర రూ.108.48, డీజిల్ ధర రూ.93.72.

పాట్నా: లీటర్ పెట్రోల్ ధర రూ.107.24, డీజిల్ ధర రూ.94.04

ఎక్సైజ్‌ డ్యూటీ, డీలర్‌ కమీషన్‌, ఇతర చార్జీలు కలిపితే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతాయి. విదేశీ మారకపు ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ఆధారంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి.

 పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతిరోజూ సమీక్షిస్తుంటారు అలాగే ఉదయం 6 గంటలకు కొత్త ధరలు వర్తిస్తాయి. మీరు ప్రతిరోజూ పెట్రోల్ డీజిల్ ధరలను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్లు వారి సిటీ కోడ్‌తో పాటు RSP అని టైప్ చేసి  9224992249 నంబర్‌కు, BPCL కస్టమర్‌లు RSP అని టైప్ చేసి 9223112222 నంబర్‌కు ఎస్‌ఎం‌ఎస్ పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios