Asianet News TeluguAsianet News Telugu

నేడు పెట్రోల్, డీజిల్ కొత్త ధరలు విడుదల: మీ నగరంలో ఒక లీటరు ధర ఎంతో చెక్ చేసుకోండి..

గత ఏడాది మే 21న దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరి మార్పు జరిగింది, అప్పట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. మే 2022లో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటి నుండి, కొన్ని రాష్ట్రాలు ఇంధనాలపై వ్యాట్ ధరలను తగ్గించగా, కొన్ని పెట్రోల్,  డీజిల్‌పై సెస్ విధించాయి.

Petrol Diesel Fresh Prices Announced Today: Check Rates In Delhi, Lucknow, Other Cities-sak
Author
First Published Jun 5, 2023, 9:11 AM IST

నేడు జూన్ 5 సోమవారం రోజున దేశ రాజధాని న్యూఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలో  పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. గత పన్నెండు నెలలకు పైగా పెట్రోలు, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అయినప్పటికీ, ఒక్కొక్క నగరాలలో ప్రతిరోజూ వీటి  ధరలలో హెచ్చుతగ్గులను చూస్తాయి. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి, వాల్యూ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది.

గత ఏడాది మే 21న దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరి మార్పు జరిగింది, అప్పట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. మే 2022లో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటి నుండి, కొన్ని రాష్ట్రాలు ఇంధనాలపై వ్యాట్ ధరలను తగ్గించగా, కొన్ని పెట్రోల్,  డీజిల్‌పై సెస్ విధించాయి.

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉండగా, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో పెట్రోలు ధర లీటరుకు రూ. 106.31, డీజిల్ ధర లీటరుకు రూ. 94.27గా ఉంది. ఇదిలా ఉండగా, కోల్‌కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర లీటరుకు రూ.92.76. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర లీటరుకు రూ.94.24.

 ఇతర నగరాల్లో ఇంధన ధరలు:
బెంగళూరు:  పెట్రోలు ధర: లీటరుకు రూ. 101.94, డీజిల్ ధర: రూ. 87.89
చండీగఢ్:  పెట్రోలు ధర: లీటరుకు రూ. 96.20, డీజిల్ ధర: రూ. 84.26
గురుగ్రామ్:  పెట్రోల్ ధర: లీటరుకు రూ. 97.04, డీజిల్ ధర: రూ. 89.91
లక్నో:  పెట్రోల్ ధర: లీటరుకు రూ. 96.57, డీజిల్ ధర: రూ. 89.76
నోయిడా:  పెట్రోలు ధర: లీటరుకు రూ. 96.65, డీజిల్ ధర: రూ. 89.82

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( BPCL ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సహా ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు,   ఫారెక్స్ రేట్లకు అనుగుణంగా ప్రతిరోజూ పెట్రోల్,  డీజిల్ ధరలను సవరిస్తాయి. పెట్రోల్  డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు ఉంటె  ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి అమలు చేయబడతాయి.  

ఈరోజు క్రూడాయిల్  ధర
ప్రపంచంలోని అగ్రశ్రేణి ఎగుమతిదారు సౌదీ అరేబియా జూలై నుండి రోజుకు మరో 1 మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తిని తగ్గించాలని  చేయడంతో చమురు ధరలు సోమవారం బ్యారెల్‌కు $1 కంటే ఎక్కువ పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు $78.73 సెషన్-గరిష్ఠ స్థాయిని తాకిన తర్వాత 0014 GMT వద్ద $1.51 లేదా 2% పెరిగి $77.64 వద్ద ఉన్నాయి. US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ బ్యారెల్‌కు $75.06 ఇంట్రాడే గరిష్టాన్ని తాకిన తర్వాత $1.41 లేదా 2% పెరిగి బ్యారెల్ $73.15కి చేరుకుంది.

హైదరాబాద్ లో ఈరోజు పెట్రోల్ ధర లీటరుకు రూ. 109.66.  డీజిల్ ధర రూ. 97.82 లీటరుకి.

మీరు మీ నగరంలో ఇంధన ధరను చెక్  చేయడానికి SMS సౌకర్యం ఉపయోగించవచ్చు. ఇండియన్ ఆయిల్ ఇంధన ధరలను తెలుసుకోవడానికి మీరు RSP < డీలర్ కోడ్ > అని టైప్ చేసి 9224992249కి SMS పంపాలి, HPCL కస్టమర్లు HPPRICE < డీలర్ కోడ్ > అని 9222201122కి టైప్ చేసి  పంపాలి, BPCL కస్టమర్లు < డీలర్ కోడ్ > అని టైప్ చేసి 9223112222కి SMS పంపాలి. దీని తర్వాత చమురు కంపెనీలు మీ నగరంలోని తాజా ధరలను మీ మొబైల్‌కు పంపుతాయి.

Follow Us:
Download App:
  • android
  • ios