Asianet News TeluguAsianet News Telugu

స్థిరంగా ఇంధన ధరలు.. మీ నగరంలో నేడు 1 లీటర్ పెట్రోల్-డీజిల్ కోసం ఎంత చెల్లించాలంటే..?

పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి, విలువ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది.
 

Petrol and Diesel Rate Today 3 February: Fuel prices steady Check rates in Delhi Mumbai other cities here
Author
First Published Feb 3, 2023, 9:15 AM IST

 అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధరలు హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి. చాలా సార్లు క్రూడ్ ఆయిల్  ధరల పతనం లేదా పెరుగుదల ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరలలో కనిపిస్తుంది. నేడు ఫిబ్రవరి 3న ఇండియాలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తాజా ఇంధన  ధరలను విడుదల చేశాయి. గత ఏడాది మే 22 నుంచి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. గత కొన్ని నెలలుగా ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు పెట్రోల్, డీజిల్ తాజా ధరల ప్రకారం లీటరు ధర ఎంతంటే..

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.96.72గా ఉండగా,  డీజిల్ ధర లీటరుకు రూ.89.62గా ఉంది. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి, విలువ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది.

క్రూడాయిల్  ధరలు శుక్రవారం ప్రారంభ ట్రేడ్‌లో స్వల్ప లాభాలను ఆర్జించాయి, అయితే ఇతర ప్రముఖ ఆర్థిక వ్యవస్థలలో దూసుకుపోతున్న తిరోగమనాలను అధిగమించడానికి చైనాలో ఇంధన డిమాండ్‌లో బలమైన పునరుద్ధరణకు మార్కెట్ మరిన్ని సంకేతాలను వెతుకుతున్నందున, వరుసగా రెండవ వారం నష్టాల వైపు పయనిస్తోంది అని ఒక నివేదిక తెలిపింది.

చెన్నై: పెట్రోలు ధర లీటరుకు రూ. 102.63, డీజిల్ ధర రూ. 94.24
కోల్‌కతా: నేడు పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 106.03, డీజిల్ ధర లీటర్‌కు రూ. 92.76,
బెంగళూరు: పెట్రోలు ధర లీటరుకు రూ. 101.94, డీజిల్ ధర రూ.89 లీటరుకు
లక్నో: పెట్రోలు ధర లీటరుకు రూ. 96.57, డీజిల్ ధర రూ. 89.76
నోయిడా: పెట్రోల్ ధర రూ. 96.79, డీజిల్ ధర లీటరుకు రూ. 89.96 
గురుగ్రామ్: పెట్రోల్ ధర రూ. 97.18, డీజిల్ ధర రూ. లీటరుకు 90.05
చండీగఢ్: పెట్రోలు ధర లీటరుకు రూ. 96.20, డీజిల్ ధర రూ. 84.26
హైదరాబాద్: పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర  రూ.97.82

గత ఏడాదిలో మే 2022లో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటి నుండి, కొన్ని రాష్ట్రాలు ఇంధన ధరలపై వ్యాట్ ధరలను కూడా తగ్గించాయి. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం జనవరి 8న డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ని లీటరుకు రూ.3 పెంచింది. వివిధ ఇంధన స్టేషన్లను బట్టి ఈ పెంపు మారుతూ ఉంటుంది. మరోవైపు పెట్రోల్‌పై ప్రభుత్వం 0.55 పైసలు పన్నును తగ్గించింది. ఈ సవరణ తర్వాత డీజిల్‌పై వ్యాట్ ఇప్పుడు లీటరుకు రూ.4.40 నుండి రూ.7.40కి పెరగనుంది, దీనితో రాష్ట్రంలో ధరలు లీటరుకు రూ.86కి చేరాయి.

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సహా ప్రభుత్వ రంగ OMCలు అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు ఇంకా ఫారెక్స్ రేట్లకు అనుగుణంగా ప్రతిరోజూ ధరలను సవరిస్తాయి. పెట్రోల్,  డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు ఉంటే ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి అమలు చేయబడతాయి. గత ఏడాది మే 21న దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరిసారి మార్పు జరిగింది, ఆ సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు.

Follow Us:
Download App:
  • android
  • ios