నేడు స్థిరంగా ఇంధన ధరలు.. 14 నెలలుగా దిగిరాని పెట్రోల్, డీజిల్.. ఒక లీటరుకు ఎంతంటే..?

గత ఏడాది మే 21న దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరి మార్పు జరిగింది, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. మే 2022లో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటి నుండి, కొన్ని రాష్ట్రాలు ఇంధనాలపై వ్యాట్ ధరలను తగ్గించగా, కొన్ని రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై సెస్ విధించాయి.

petrol and Diesel Rate Today 24 July:  Check rates in uour cities here-sak

నేడు జూలై 24 సోమవారం రోజున న్యూఢిల్లీ, కోల్‌కతా, ముంబై ఇంకా చెన్నైలో పెట్రోల్, డీజిల్ ధరలు చాలా వరకు స్థిరంగా ఉన్నాయి. గత కొన్ని నెలలుగా పెట్రోలు, డీజిల్ ధరలు మారలేదు. అయితే, ఒక్కొక్క నగరాలలో ప్రతిరోజూ వీటి ధరలలో హెచ్చుతగ్గులను చూస్తాయి. ఇంకా ధరలు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి, వాల్యూ  ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది.

గత ఏడాది మే 21న దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరి మార్పు జరిగింది, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. మే 2022లో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటి నుండి, కొన్ని రాష్ట్రాలు ఇంధనాలపై వ్యాట్ ధరలను తగ్గించగా, కొన్ని రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై సెస్ విధించాయి.

గత నెలలో పంజాబ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్)ని పెంచింది. ఆమ్  ఆద్మీ పార్టీ  (ఆప్) ప్రభుత్వం రిటైల్ వినియోగదారుల కోసం పెట్రోల్ ధరలను 92 పైసలు, డీజిల్ ధరలను 88 పైసలు పెంచింది. ఫలితంగా ఇప్పుడు రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర రూ.98.65గా ఉండగా, చండీగఢ్‌లో డీజిల్ ధర రూ.88.95గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధరలు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ కు 80.60 డాలర్లకు, డబ్ల్యూటీఐ ధర బ్యారెల్ కు 76.64 డాలర్లకు పెరిగింది.

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉండగా, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో పెట్రోలు ధర లీటరుకు రూ. 106.31, డీజిల్ ధర లీటరుకు రూ. 94.27గా ఉంది. ఇదిలా ఉండగా కోల్‌కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర లీటరుకు రూ.92.76. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63కు లభిస్తుండగా, డీజిల్ ధర లీటరుకు రూ.94.24కే లభిస్తోంది. 

ఇతర నగరాల్లో ఇంధన ధరలను ఇక్కడ చూడండి:

బెంగళూరు:  పెట్రోలు ధర: లీటరుకు రూ. 101.94, డీజిల్ ధర: రూ. 87.89

చండీగఢ్:  పెట్రోలు ధర: లీటరుకు రూ. 98.65, డీజిల్ ధర: రూ. 88.95

 గురుగ్రామ్:  పెట్రోల్ ధర: లీటరుకు రూ. 97.04, డీజిల్ ధర: రూ. 89.91

 లక్నో:  పెట్రోల్ ధర: లీటరుకు రూ. 96.57, డీజిల్ ధర: రూ. 89.76

నోయిడా:  పెట్రోలు ధర: లీటరుకు రూ. 96.65, డీజిల్ ధర: రూ. 89.82

హైదరాబాద్ పెట్రోల్ ధర రూ. 109.66, డీజిల్ ధర  రూ. 97.82

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( BPCL ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సహా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు)   అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు ఇంకా ఫారెక్స్ రేట్లకు అనుగుణంగా ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తాయి. పెట్రోల్  డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు  ఉంటె ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి అమలు చేయబడతాయి.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios