నేడు స్థిరంగా ఇంధన ధరలు.. లీటరు పెట్రోల్, డీజిల్ ధర మీ నగరంలో ఎంతో చెక్ చేసుకోండి..

గత ఏడాది మే 21న దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరి మార్పు జరిగింది, అప్పట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. మే 2022లో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటి నుండి, కొన్ని రాష్ట్రాలు ఇంధనాలపై వ్యాట్ ధరలను తగ్గించగా, కొన్ని రాష్ట్రాలు పెట్రోల్ డీజిల్‌పై సెస్ విధించాయి.
 

Petrol and Diesel Rate Today, 14 June: Some cities see revision; Check rates in Delhi, Mumbai, other cities-SAK

నేడు జూన్ 14 బుధవారం రోజున  ప్రముఖ మెట్రో నగరాలు న్యూఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నైలో పెట్రోల్  డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. గత పన్నెండు నెలలకు పైగా  ఇంధన ధరలు మారలేదు. అయినప్పటికీ, ఒక్కొక్క నగరాలలో ప్రతిరోజూ  ధరలలో హెచ్చుతగ్గులను చూస్తాయి.  ఇంకా పెట్రోల్,  డీజిల్ ధరలు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి, వాల్యూ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వివిధ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది.

గత ఏడాది మే 21న దేశ వ్యాప్తంగా ఇంధన ధరల్లో చివరి మార్పు జరిగింది, అప్పట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై రూ.6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించారు. మే 2022లో కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటి నుండి, కొన్ని రాష్ట్రాలు ఇంధనాలపై వ్యాట్ ధరలను తగ్గించగా, కొన్ని రాష్ట్రాలు పెట్రోల్ డీజిల్‌పై సెస్ విధించాయి.

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉండగా, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో పెట్రోలు ధర లీటరుకు రూ. 106.31, డీజిల్ ధర లీటరుకు రూ. 94.27గా ఉంది. ఇదిలా ఉండగా, కోల్‌కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర లీటరుకు రూ.92.76. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63కు లభిస్తుండగా, డీజిల్ ధర లీటరుకు రూ.94.24కే లభిస్తోంది.

 ఇతర నగరాల్లో ఇంధన ధరలు:
 బెంగళూరు:  పెట్రోలు ధర: లీటరుకు రూ. 101.94, డీజిల్ ధర: రూ. 87.89
చండీగఢ్:  పెట్రోలు ధర: లీటరుకు రూ. 98.65, డీజిల్ ధర: రూ. 88.95
 గురుగ్రామ్:  పెట్రోల్ ధర: లీటరుకు రూ. 97.04, డీజిల్ ధర: రూ. 89.91
 లక్నో:  పెట్రోల్ ధర: లీటరుకు రూ. 96.57, డీజిల్ ధర: రూ. 89.76
 నోయిడా:  పెట్రోలు ధర: లీటరుకు రూ. 96.65, డీజిల్ ధర: రూ. 89.82

హైదరాబాద్

పెట్రోల్ ధర: రూ. 109.66
డీజిల్ ధర: రూ. 97.82

బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0019 GMT నాటికి 27 సెంట్లు లేదా 0.4% తగ్గి బ్యారెల్ $74.01కి చేరుకుంది. US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ 29 సెంట్లు లేదా 0.4% తగ్గి బ్యారెల్ $69.13 వద్ద ఉంది.

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ( BPCL ), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) సహా ప్రభుత్వ రంగ ఆయిల్  మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) అంతర్జాతీయ బెంచ్‌మార్క్ ధరలు అండ్  ఫారెక్స్ రేట్లకు అనుగుణంగా ప్రతిరోజూ పెట్రోల్ డీజిల్ ధరలను సవరిస్తాయి. పెట్రోల్ డీజిల్ ధరలలో ఏవైనా మార్పులు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి అమలు చేయబడతాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధర స్థిరంగా ఉండి, వచ్చే త్రైమాసికంలో ఈ కంపెనీలకు మంచి ఫలితాలు వస్తే పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించే అంశాన్ని ఆయిల్ కంపెనీలు పరిశీలించగలవని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇటీవల అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios