గత రెండు రోజుల విరామం తర్వాత శుక్రవారం ప్రభుత్వ చమురు సంస్థలు మళ్లీ ఇంధన ధరలను సవరించాయి, దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు తాజా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసి) గణాంకాల ప్రకారం పెట్రోల్ ధరపై లీటరుకు 27 పైసలు, డీజిల్ ధరపై 28 పైసలు పెంచారు.

దేశ రాజధాని ఢీల్లీలో ఒక లీటరు పెట్రోల్ ధర. 94.76, డీజిల్ ధర. 85.66గా ఉంది. ముంబైలో పెట్రోల్ ధర  సెంచరీ దాటి  లీటరుకు. 100.98 నుండి  రూ.101 మార్కుకు చేరుకుంది. డీజిల్ ధర లీటరు రూ.92.99గా ఉంది.

also read కరోనా కాలంలో ఒక్కనెల జీతం కూడా తీసుకొని ఆసియా సంపన్నుడు.. కానీ అతని సంపాదన ఎంతో తెలుసా ? ...

చెన్నైలో పెట్రోల్ ధర 96.23, డీజిల్ ధర లీటరుకు రూ.90.38గా ఉన్నాయి. కోల్‌కతాలో పెట్రోల్‌ ధర రూ.94.76, డీజిల్‌ ధర లీటరుకు రూ.88.51గా ఉన్నాయి.

ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని పలు నగరాల్లో  పెట్రోల్ ధర రూ.100 మార్కును దాటి పరుగులుపెడుతుంది. హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర లీటరుకు సెంచరీకి చేరువలో రూ.98.48గా ఉంది, డీజిల్‌ ధర రూ.  93.38. ఇంధన ధరలు విలువ ఆధారిత పన్నును బట్టి   ప్రతి రాష్ట్రానికి మారుతుంది.

సౌదీ అరేబియా క్రూడ్ ధర బ్యారెల్కు 70 డాలర్లకు పైగా పెరగటంతో  ఆసియాలోని ప్రధాన మార్కెట్లో చమురు ధరలను ఊహించిన దానికంటే పెంచింది.