భారతదేశం, సింగపూర్ మధ్య డబ్బు పంపడం ఇప్పుడు UPI యాప్ ద్వారా చాలా సులభం అయ్యింది. దీని కోసం సింగపూర్‌కు చెందిన Paynow యాప్‌తో భారతదేశపు UPI అధికారికంగా జతకట్టింది.

భారత్, సింగపూర్ మధ్య డబ్బు పంపడం ఇప్పుడు UPI యాప్ ద్వారా చాలా సులభతరం అయ్యింది. దీని కోసం సింగపూర్‌కు చెందిన Paynow యాప్‌తో భారతదేశపు UPI అధికారికంగా జతకట్టింది. సింగపూర్‌కి చెందిన PayNow, భారత్ కు చెందిన UPI ద్వారా భారతీయులు సింగపూర్‌కు డబ్బు పంపడాన్ని సులభతరం అయ్యింది. UPI ద్వారా ఇరు దేశాల్లోని ప్రజలు వస్తువులు , సేవలకు చెల్లించడానికి ఈ భాగస్వామ్యం ఉపయోగపడుతుంది. అదేవిధంగా, సింగపూర్ వాసులు తమ PayNow యాప్‌ను భారత్ లో ఉపయోగించవచ్చు. ముఖ్యంగా సింగపూర్‌లో నివసిస్తున్న భారతీయులు తమ బంధువులకు సులభంగా డబ్బు పంపవచ్చు. ప్రధాని నరేంద్ర మోదీ, సింగపూర్ ప్రధాని లీ హీన్ లూంగ్ సంయుక్తంగా వీడియో ద్వారా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు.

భారత్, సింగపూర్ మధ్య కొత్త అధ్యాయం
ఇన్నోవేషన్ , ఫైనాన్షియల్ టెక్నాలజీలో ఇరు దేశాల మధ్య సహకారం మరింత లోతుగా ఉన్నందున భారత్-సింగపూర్ స్నేహానికి ఈ రోజు గొప్ప రోజు అని ప్రధాని మోదీ అన్నారు. "నా స్నేహితుడు ప్రధాన మంత్రి లీ హీన్ లూంగ్‌తో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం మరింత బాగుంది." అని మోదీ పేర్కొన్నారు. రెండు దేశాల యాప్‌లు లింక్ చేయబడినందున, సింగపూర్‌లో నివసిస్తున్న భారతీయులు సులభంగా డబ్బు పంపవచ్చు. 

UPI ద్వారా క్రాస్-బోర్డర్ పీర్-టు-పీర్ చెల్లింపులను అనుమతించిన మొదటి దేశం సింగపూర్ కావడం విశేషం. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, “సింగపూర్‌లోని భారతీయులు, ముఖ్యంగా కార్మికులు , విద్యార్థులు డిజిటల్ టెక్నాలజీ నుండి ప్రయోజనం పొందవచ్చు. సింగపూర్ నుంచి అవసరమైన డబ్బును తక్కువ ఖర్చుతో పంపించవచ్చు. క్యూఆర్ కోడ్ ద్వారా యూపీఐ అప్లికేషన్‌ను సింగపూర్‌లోని కొన్ని చోట్ల ఇప్పటికే ప్రవేశపెట్టడం గమనార్హం.

సింగపూర్ ప్రధాన మంత్రి లీ హీన్ లూంగ్ మాట్లాడుతూ, “PayNow , UPI యాప్‌ను సంయుక్తంగా ప్రారంభించడంలో ప్రధాని మోదీతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ , రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ధన్యవాదాలు. ఈ విలీనం వల్ల సింగపూర్, భారత్‌లోని ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందుతారని ఆయన అన్నారు