మీలో చాలా మందికి క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ఉండే ఉంటుంది. అయితే క్రెడిట్-డెబిట్ కార్డ్ వినియోగదారులకు ఒక హెచ్చరిక, ఎందుకంటే 10 కోట్ల క్రెడిట్-డెబిట్ కార్డ్ హోల్డర్ల వ్యక్తిగత సమాచారం డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టారు.

డార్క్ వెబ్‌లో విక్రయించిన సమాచారంలో క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ వినియోగదారుల పూర్తి పేరు, మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ఐడి, కార్డ్ మొదటి నాలుగు ఇంకా చివరి నాలుగు సంఖ్యలు ఉంటాయి.

అమెజాన్, మేక్ మై ట్రిప్, స్విగ్గి వంటి ప్లాట్‌ఫాంల నుంచి ఈ డేటా లీక్ లీక్ అయిందని చెబుతున్నారు. ఈ డేటా అంతా 2020 ఆగస్టులో లీక్ అయినట్లు బెంగళూరుకు చెందిన స్టార్టప్ పేర్కొంది.

ఒక నివేదిక ప్రకారం, లీకైన డేటా మొత్తం మార్చి 2017 నుండి 2020 ఆగస్టు వరకు జరిగిన లావాదేవీల మొత్తం సమాచారం ఉన్నట్లు పేర్కొంది. లీకైన డేటా చాలా వరకు భారతీయ క్రెడిట్-డెబిట్ కార్డ్ హోల్డర్ల నుండి సేకరించిందే. 

also read పిల్లలకు కూడా కోవిడ్-19 వ్యాక్సిన్ ఇవ్వొచా..? వయస్సుకి సంబంధించిన నియమాలను తెలుసుకోండి.. ...

మీరు ఏమి చేయాలి?

మొదటి మీరు చేయాల్సింది ఏమిటంటే, మీరు ఆన్‌లైన్ సైట్ నుండి క్రెడిట్-డెబిట్ కార్డు ద్వారా చేసిన పేమెంట్ కార్డును సేవ్ చేయవద్దు. ఇది కాకుండా, మీరు ఇప్పటికే మీ కార్డును సేవ్ చేసి ఉంటే, వెంటనే దాన్ని తొలగించండి.

మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ పిన్ ను కూడా తక్షణమే మార్చండి లేదంటే మీ ఖాతా నుండి డబ్బు మాయం అయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో ఏదైనా అనుకోని మార్పులు జరిగి ఉంటే మూడు రోజుల్లో బ్యాంకుకు ఫిర్యాదు చేయండి అలాగే సైబర్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ కూడా దాఖలు చేయండి.

గత ఏడాది నవంబర్‌లో కూడా దేశంలో సుమారు 1.3 మిలియన్ల ప్రజల క్రెడిట్, డెబిట్ కార్డుల సమాచారం బయటపడింది. ఆ సమయంలో కూడా క్రెడిట్ / డెబిట్ కార్డు సమాచారం డార్క్ వెబ్‌లోనే అమ్మకానికి పెట్టారు. ఈ ఘటన తరువాత, ఈ విషయంపై దర్యాప్తు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని సంబంధిత బ్యాంకులను ఆదేశించింది.