దేశంలోని వాహనదారులకు మరింత ఊరట కలిగించే సమాచారం. గల్ఫ్‌ దేశాలు తమ ముడిచమురు ఉత్పత్తిని మరింత పెంచే అవకాశం ఉందనే సమాచారంతో శుక్రవారం  అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు సుమారు ఆరు శాతానికి పైగా క్షీణించాయి. ప్రధానంగా న్యూయార్క్‌ మార్కెట్‌, యూరప్‌ మార్కెట్లలో ఈ పతనం నమోదైంది. 

ఏడాది కాలంలో ఒక్కరోజే ముడిచమురు ధరల్లో ఆరు శాతం తగ్గుదల నమోదుకావడం ఇదే తొలిసారని మార్కెట్‌వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో సరఫరా చేయడానికి ఉద్దేశించిన లావాదేవీల్లో బ్యారెట్‌ ముడిచమురు ధర న్యూయార్క్‌ మార్కెట్‌లో 4.21 డాలర్లకు క్షీణించి 50.42 డాలర్లకు పడిపోయింది. 

ఇదే పరిస్థితి కొనసాగితే ముడి చమురు ఉత్పత్తి దేశాలు ఉత్పత్తిని తగ్గిస్తాయని మదుపర్లు ఆందోళన చెందుతున్నారు. బ్రెంట్ ఆయిల్ ధర శుక్రవారం బ్యారెల్ కు  59.26 డాలర్ల (రూ.4,188.20) వద్ద స్థిర పడింది. ఇది గతేడాది అక్టోబర్ నెల ధరతో సమానం. ఈ ఏడాది అక్టోబర్ ప్రారంభం ధరతో పోలిస్తే ముడి చమురు ధరలు 30 శాతానికి పైగా పతనం అయ్యాయి. అక్టోబర్ నెలలో బ్యారెల్ ముడి చమురు ధర 86$ (రూ.6,078.05) పలికితే, శుక్రవారం మార్కెట్‌లో ముడి చమురు ధర 7.7 శాతం తగ్గి 50.42 డాలర్లతో (రూ.3,5,64.43)గా నమోదైంది. ఇదీ కూడా గతేడాది అక్టోబర్ మధ్య భాగంలో పలికన బలహీన ధర కావడం గమనార్హం. ఈ ఏడాది ప్రారంభంలోనూ ముడి చమురు ధర బ్యారెల్‌పై 55.69 డాలర్లకు తగ్గి రూ.3,935.89 వద్ద స్థిర పడింది. 2015 సెప్టెంబర్ ఒక్కరోజు భారీగా ముడి చమురు ధర తగ్గడం ఇప్పుడే.

ఈ పరిస్థితుల్లో డిసెంబర్‌ 6న జరిగే సమావేశంలో ఓపెక్‌ దేశాలు ముడిచమురు ఉత్పత్తిని తగ్గించడంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనే అంశంపైనే మళ్లీ ధరలు పెరిగే అవకాశం ఉంటుందని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు. అటు చమురు ధరల పతనాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు సూచిస్తున్నారు.