పీఎన్బీ( పంజాబ్ నేషనల్ బ్యాంకు)ను రూ.కోట్లలో మోసం చేసి పరారైన నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్ లోని ఓ జైల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. కాగా... తాజాగా ఆయన బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. నీరవ్ మోదీ పిటిషన్ ని జూ 11వ తేదీన న్యాయస్థానం పరిశీలించనుందని అక్కడి అధికారులు  చెబుతున్నారు.

పీఎన్‌బీ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన ఆయనను లండన్‌ పోలీసులు మార్చి 19న అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన జైలులో ఉంటున్నారు. రూ.13,500 కోట్ల కుంభకోణం కేసులో పరారీలో ఉన్న ఆయనను నగదు అక్రమ చలామణీ కేసులో అప్పగించాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గతంలో బ్రిటన్‌ను విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. 

కాగా, ఒకవేళ నీరవ్‌ను భారత్‌కు అప్పగిస్తే ఏ జైల్లో ఉంచుతారన్న విషయాన్ని తమకు తెలియజేయాల్సిందిగా భారత అధికారవర్గాలను గురువారం బ్రిటన్‌ కోర్టు కోరింది. ఈ విషయాన్ని తమకు 14 రోజుల్లోగా తెలపాలని సూచించింది.