Asianet News TeluguAsianet News Telugu

విద్యార్థులను ఉద్యోగార్హులుగా మార్చడానికి వినూత్నమైన గెట్‌ సెట్‌ గో కార్యక్రమం ప్రారంభం..

 తెలుగు రాష్ట్రాలలోని విద్యాసంస్థలకు చెందిన విద్యార్థుల ఉద్యోగార్హత నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడటం కోసం ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించింది. 

NHRD Hyderabad launched innovative program improving the employability skills of students in educational institutions
Author
Hyderabad, First Published Nov 20, 2020, 6:10 PM IST

హైదరాబాద్‌, నవంబర్‌ 20, 2020 : నేషనల్‌ హెచ్‌ఆర్‌డీ నెట్‌వర్క్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌డీ) హైదరాబాద్‌,  తెలుగు రాష్ట్రాలలోని విద్యాసంస్థలకు చెందిన విద్యార్థుల ఉద్యోగార్హత నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడటం కోసం ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించింది.

శ్రీ శ్రీని ఉడుముల నాయకత్వంలోని ఎన్‌హెచ్‌ఆర్‌డీ హైదరాబాద్‌ చాప్టర్ మేనేజ్‌మెంట్‌లో తాజా ధోరణులను గురించి ఫ్యాకల్టీకి వెల్లడించడం, తగిన మద్దతునందించడం మరియు పరిశ్రమతో సమన్వయం కలిగించడం ద్వారా విద్యాసంస్థలను బలోపేతం చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసింది.

పరిశ్రమ అంచనాలను అర్థం చేసుకోవడం, తగిన రెజ్యూమ్‌ తీర్చిదిద్దడం, తమంతట తాముగా ఇంటర్న్‌షిప్స్‌కు అందుబాటులో ఉండటం మరియు ఉద్యోగ ఇంటర్వ్యూల కోసం సిద్ధంకావడంలో విద్యార్థులకు సహాయం అవసరం. ఈ సవాళ్లను వినూత్నమైన కార్యక్రమం గెట్‌ సెట్‌ గో– మెంటార్‌@క్యాంపస్‌ ద్వారా పరిష్కరించే ప్రయత్నాన్ని ఎన్‌హెచ్‌ఆర్‌డీ చేస్తుంది.

సుప్రసిద్ధ సంస్థలలో నాయకత్వ బాధ్యతలలో  కార్యకలాపాలు నిర్వహిస్తున్న దాదాపు 100 ప్రాక్టీసింగ్‌ ప్రొఫెషనల్స్‌, ఎంపిక చేసిన   ప్రీమియర్‌ బీ– స్కూల్‌ విద్యార్థులతో నేరుగా లేదా వర్ట్యువల్‌గా సంభాషించడం మరియు మెంటార్‌ చేయడం చేయనున్నారు.

also read మునిగిపోతున్న లక్ష్మి విలాస్ బ్యాంక్ కథ.. గత 10 సంవత్సరాలలో 5 మంది సిఇఓలు మారారు.. ...

వారు విద్యార్థులతో సంభాషించడంతో  పాటుగా పరస్పర నైపుణ్యాలను నిర్మించుకోవడం, రెజ్యూమ్‌ రాయడం, ఇంటర్న్‌షిప్స్‌ కోసం తమను తాము సిద్ధం చేసుకోవడం మరియు ఇంటర్వ్యూ నైపుణ్యాలకు పదును పెట్టడం వంటి అంశాలలో సదస్సులను కూడా నిర్వహించనున్నారు.

ఎంపికచేసుకున్న బీ–స్కూల్స్‌లో లెర్నింగ్‌ సర్కిల్స్‌ లేదా క్లబ్స్‌ను సృష్టించడానికి ఎన్‌హెచ్‌ఆర్‌డీ ప్రయత్నించడంతో పాటుగా ఈ క్లబ్స్‌ను విద్యార్థులే తమంతట తాముగా పరిశ్రమ మెంటార్‌ మరియు ఫ్యాకల్టీ మార్గనిర్ధేశకంలో నిర్వహించేలా తీర్చిదిద్దుతుంది.

ఈ క్లబ్స్‌ , సమకాలీన సమస్యలు మరియు మేనేజ్‌మెంట్‌లో ఉన్న ధోరణులపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా పరిశ్రమ నుంచి ప్రాక్టికల్‌ ప్రావీణ్యతలను ఫ్యాకల్టీ పొందగలరు.

ఈ కోణంలోనే, మేము ఎంపిక చేసుకున్న విద్యాసంస్ధలతో అవగాహన ఒప్పందం చేసుకోవడం ప్రారంభించడంతో పాటుగా రాబోయే రెండు నెలల్లో వేగంగా దీనిని విస్తరించనున్నాం. అన్ని బీ–స్కూల్స్‌ తమను చేరుకోవడంతో పాటుగా ఈ కార్యక్రమంలో భాగం కావాల్సిందిగా ఎన్‌హెచ్‌ఆర్‌డీ కోరుతుంది.

ఈ సందర్భంగా శ్రీ శ్రీకాంత్‌ సూరంపూడి, ఛైర్‌– క్యాంపస్‌ కనెక్ట్‌ అండ్‌ అకడమిక్‌ బోర్డ్‌, ఎన్‌హెచ్‌ఆర్‌డీ హైదరాబాద్‌ మాట్లాడుతూ ‘‘పరిశ్రమ మరియు విద్యా సంస్థల నడుమ బలీయమైన బంధాన్ని గెట్‌–సెట్‌–గో ఏర్పరచగలదని మేము బలంగా నమ్ముతున్నాము.

ఇది  అత్యంత క్లిష్టమైన మరియు జీవితాన్ని మార్చే నైపుణ్యాలను విద్యార్థులు పొందేందుకు సహాయపడటంతో పాటుగా సమకాలీన అంశాలపై పరిశోధనలను చేసేలా ఫ్యాకల్టీని ఉత్సాహరచడంలోనూ సహాయపడుతుంది.

‘యుక్త వయసులో ఉన్నప్పుడే వారిని ఒడిసిపట్టుకోండి’ అనేది రేపటి పరిశ్రమ నిపుణులుగా నిలిచే విద్యార్థులను తీర్చిదిద్దడంలో మా విధానం’’ అని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios