Meta AI Widget: వాట్సాప్‌ ఒకటుంటే చాలు.. AI మొత్తం మీ చేతుల్లో ఉన్నట్టే. వాట్సాప్ లో సూపర్ అప్డేట్

Meta AI Widget: వాట్సాప్ యాప్‌లో సూపర్ అప్డేట్ రాబోతోంది. అదే ‘మెటా AI విడ్జెట్‌’. ఇది ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. ఇది యాప్ తెరవకుండానే AI ఫీచర్లను వాడటానికి హెల్ప్ చేస్తుంది. యూజర్లు హోమ్ స్క్రీన్ నుంచే ప్రశ్నలు అడగవచ్చు. పిక్చర్స్ అప్‌లోడ్ చేయవచ్చు. వాయిస్ మోడ్‌లో మాట్లాడవచ్చు. మెటా AI విడ్జెట్‌ గురించి మరిన్ని ఆశ్చర్యకర వివరాలు తెలుసుకుందాం. 

New Meta AI Widget Coming to WhatsApp Soon in telugu sns

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాడే వాట్సాప్ తన వినియోగదారుల కోసం కొత్త అప్డేట్ తీసుకొచ్చింది. వాట్సాప్ యాప్ నుంచి బయటకు రాకుండానే యూజర్లు AI ఫీచర్లను వాడేలా సౌకర్యం కల్పిస్తోంది. వాట్సాప్ డెవలపర్లు ఒక కొత్త మెటా AI (Meta AI) విడ్జెట్‌ను టెస్ట్ చేస్తున్నారు. ఇది త్వరలోనే వాట్సాప్ యూజర్లు యాప్ తెరవకుండానే AI ఫీచర్‌ను వాడటానికి హెల్ప్ చేస్తుంది.

లేటెస్ట్ బీటా వెర్షన్‌లో కొత్త మెటా AI విడ్జెట్

ఈ విడ్జెట్ ఇప్పుడు లేటెస్ట్ బీటా వెర్షన్‌లో ఉందని కొందరు వాట్సాప్ యూజర్లు చెప్పారు. కొత్త మెటా AI విడ్జెట్, వాట్సాప్ యాప్ తెరిచి చాట్‌బాట్‌లోకి వెళ్లి ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేకుండా యూజర్లు మొబైల్ హోమ్ స్క్రీన్ నుంచే డైరెక్ట్‌గా పిక్చర్స్ అప్‌లోడ్ చేయడానికి, AI చాట్‌బాట్ వాయిస్ మోడ్ ద్వారా మాట్లాడటానికి వీలు కల్పిస్తుందట. 

WhatsApp widget

యూజర్ల ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వడానికి మెటా AI విడ్జెట్‌

WABetaInfo షేర్ చేసిన స్క్రీన్ షాట్ ప్రకారం వాట్సాప్ కొత్త మెటా AI విడ్జెట్‌ను కావాల్సినంత మార్చుకునే వీలుంది. యూజర్ తమ ఇష్టానికి తగ్గట్టు సైజు మార్చుకోవచ్చు. కానీ ఈ ఫీచర్ మెటా AI ఫీచర్ ఉన్న వాట్సాప్ వెర్షన్‌ను వాడితేనే ఈ విడ్జెట్ దొరుకుతుంది.

మెటా కంపెనీ లామా ఎల్.ఎల్.ఎమ్ ద్వారా నడిచే వాట్సాప్‌లోని మెటా AI, జెమిని, చాట్‌జిపిటిలా యూజర్ల ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వడానికి, పిక్చర్స్ క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. పర్సనల్, గ్రూప్ చాట్స్‌లో కూడా దీన్ని వాడొచ్చు. కోట్లాది మంది యూజర్లు ఆల్రెడీ వాట్సాప్‌లో మెటా AI ఫీచర్‌ను వాడుతున్నారు

వాట్సాప్ నుంచి ఇప్పటికే అనేక అప్డేట్స్ వచ్చాయి

ఈ కొత్త విడ్జెట్ ద్వారా చాట్‌బాట్ వాడకం ఇంకా పెంచొచ్చు. మెటా నెమ్మదిగా కొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తోంది. గత కొన్ని వారాల్లో, వాట్సాప్ 22 కొత్త చాట్ థీమ్స్, ట్యాబ్ రియాక్షన్స్, సెల్ఫీ స్టిక్కర్స్, షేర్ చేయగల స్టిక్కర్ ప్యాక్‌లు వంటి చాలా కొత్త ఫీచర్లను రిలీజ్ చేసింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios