చైనా యాప్ టిక్‌టాక్ పై ఇండియాలో నిషేధం తరువాత, టిక్‌టాక్ భారతదేశం వ్యాపారాన్ని కొనేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీతో చర్చలు జరుపుతోంది. జాతీయ భద్రత, డేటా గోప్యతా సమస్యలపై ప్రముఖ వీడియో-షేరింగ్ యాప్ టిక్‌టాక్ తో సహ 58 ఇతర చైనా యాప్స్ ని జూన్ 29న భారతదేశ ప్రభుత్వం నిషేధించింది.

టిక్‌టాక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండు కంపెనీలు మధ్య చర్చలు జూలైలో ప్రారంభించాయి, అయితే ఈ ఒప్పందంపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని టెక్ క్రంచ్ నివేదించింది. ఇందులో భాగంగా టిక్‌టాక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెవిన్ మేయర్, ఆర్ఐఎల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను సంప్రదించినట్లు తెలిసింది.

అయితే ఈ రెండు సంస్థలు ఇంతవరకు అధికారిక ప్రకటన చేయలేదు. జూన్‌లో టిక్‌టాక్ నిషేధానికి ముందు, టిక్‌టాక్ కు ఇండియాలో 200 మిలియన్లకు పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్నారు.

also read 

టిక్‌టాక్ కంపెనీ విలువ 3 బిలియన్ డాలర్లు. మరోవైపు అమెరికా అద్యక్షుడు ట్రంప్ నిర్ణయించిన సెప్టెంబర్ 15 గడువుకు ముందే చైనీస్ షార్ట్-వీడియో టిక్‌టాక్‌లోవాటా కొనుగోలుకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చర్చల నేపథ్యంలో తాజా అంచనాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

ఫేస్‌బుక్, గూగుల్‌తో సహా సంస్థలు రిలయన్స్ లో భారీగా పెట్టుబడులు పెట్టారు. ముఖేష్ అంబానీ ప్రణాళిక నిజంగా అద్భుతాలు చేయగలదని నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ టిక్‌టాక్ తో రిలయన్స్ ఒప్పందం కుదిరితే భారత ప్రభుత్వ భయాలను కూడా పరిష్కరించగలదు.

టిక్‌టాక్ చైనాలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వంతో సంబంధాలున్నాయని తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేసిన తరువాత దీనిని ఇండియాలో నిషేధించింది, అయితే కంపెనీ అభ్యంతరాలపై తీవ్రంగా ఖండించింది.