ఆసియా కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, బిలియనీర్ ముకేష్ అంబానీ తన పుట్టినరోజు సందర్భంగా తన భార్య నీతా అంబానీకి  ప్రైవేట్ జెట్‌ను బహుమతిగా ఇచ్చారు. ప్రపంచంలోని ధనవంతులలో ఒకరీగా నిలిచిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ అత్యంత ఖరీదైన వాటిని కలిగి ఉన్నారు,

వాటి ధర, వివరాలు గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ముంబై నగరంలో  దేశంలోని అత్యంత ఖరీదైన, విలాసవంతమైన గృహాలలో ఆంటిలియా(ముకేష్ అంబానీ ఇల్లు) ఒకటి. 27 అంతస్తులున్న ఈ ఇంటి విలువ సుమారు 200 కోట్లు అని అంచనా.

అత్యంత ఖరీదైన  బుల్లెట్ ప్రూఫ్ బి‌ఎం‌డబల్యూ కార్ కూడా ముకేష్ సొంతం. ముఖేష్ అంబానీ 1 మిలియన్ డాలర్ల (ఇండియాలో రూ. 7,46,30,000.00) విలువైన యచ్ట్(షిప్) కూడా ఉంది.

also read టిక్‌టాక్‌ను కొనుగోలు చేయనున్న ముఖేష్ అంబానీ.. ? ...

ఇదొక్కటే కాదు, ముఖేష్ అంబానీకి ఎయిర్‌బస్ 319 కార్పొరేట్ జెట్‌ కూడా ఉంది. ఈ విమానంలో ఎన్నో లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయి. ఇందులో  శాటిలైట్ టెలివిజన్, వైర్‌లెస్ కమ్యూనికేషన్‌తో కూడిన క్యాబిన్‌, మాస్టర్ బెడ్‌రూమ్, షవర్ బాత్రూమ్, ఎంటర్టైన్మెంట్ క్యాబిన్, లగ్జరీ స్కై బార్, ఫాన్సీ డైనింగ్ ఏరియా ఉన్నాయి.  

ఇందులో సుమారు 25 మంది ప్రయాణించవచ్చు. మరే ఇతర పారిశ్రామికవేత్తకు భారతదేశంలో ఇలాంటి ప్రైవేట్ జెట్ లేదు. దీనిని కొనుగోలు చేసినప్పుడు, దీని విలువ 100 మిలియన్లు (సుమారు 75 కోట్ల రూపాయలు).

ముఖేష్ అంబానీ తన పుట్టినరోజు సందర్భంగా ఈ జెట్ బహుమతిగా ఇచ్చారు. ఈ జెట్‌తో పాటు, మరో రెండు ప్రైవేట్ విమానాలైన బోయింగ్ బిజినెస్ జెట్ -2, ఫాల్కన్ 900 ఎక్స్‌లను కూడా ముఖేష్ అంబానీకి ఉన్నాయి.  తన వ్యక్తిగత ప్రయాణం కోసం అంబానీ బోయింగ్ బిజినెస్ జెట్‌ ఉపయోగిస్తారని తెలిసింది.