Asianet News TeluguAsianet News Telugu

ఎయిర్ టెల్ కి ఎదురుదెబ్బ.. పడిపోయిన రేటింగ్

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ కి ఎదురు దెబ్బ తగిలింది. ఎయిర్ టెల్ రేటింగ్ దారుణంగా పడిపోయింది

Moody's puts Airtel on ratings downgrade watch
Author
Hyderabad, First Published Nov 9, 2018, 2:51 PM IST


ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ కి ఎదురు దెబ్బ తగిలింది. ఎయిర్ టెల్ రేటింగ్ దారుణంగా పడిపోయింది.  బాండ్ రేటింగ్ లో అతి తక్కువ రేటింగ్ ఇవ్వడంతో శుక్రవారం నాటి ట్రేడింగ్ లో ఎయిర్ టెల్ కౌంటర్ ధాదాపు  5శాతానికి పడిపోయింది. మూడీస్‌ ఎయిర్‌టెల్‌కు బీఏఏఏ3 ర్యాంకింగ్‌ఇచ్చింది. లాభాలు, క్యాష్‌  ఫ్లో బలహీనంగా ఉండనుందని  మూడీస్‌ అంచనా వేసింది.

తమ సమీక్షలో ఎయిర్‌టెల్‌ లాభదాయకత, ప్రత్యేకంగా భారతీయ మొబైల్  సేవల లాభాలు క్షీణత, అధిక రుణభారం, తరుగుతున్న మూలధన నిధుల కారణంగా  ఈ అంచనాకు వచ్చినట్టు మూడీ వైస్‌ ప్రెసిడెంట్‌ , సీనియర్ క్రెడిట్ ఆఫీసర్ అన్నాలిసా డిచియారా చెప్పారు

కాగా వరుసగా పదవ త్రైమాసికంలో కూడా ఎయిర్‌టెల్‌  లాభాలు దారుణంగా పడిపోయాయి. 2018 సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో సునీల్ మిట్టల్ నేతృత్వంలోని ఎయిర్‌టెల్‌  లాభాలు 65.4 శాతం క్షీణించింరూ. 119 కోట్లనుసాధించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం 343 కోట్ల రూపాయలుగా ఉంది. మొత్తం ఆదాయం   రూ .20,422 కోట్లుగా నమోదైంది. 

Follow Us:
Download App:
  • android
  • ios