మెటా, మైక్రోసాఫ్ట్ సహా వందల కంపెనీలకు ట్రేడ్ మార్క్ అదే .. ‘‘ X ’’తో మస్క్‌కు తిప్పలేనా .. ?

ట్విట్టర్ లోగోగా వున్న నీలి రంగు పిట్ట స్థానంలో ‘‘X ’’గుర్తును తెచ్చారు అమెరికన్ బిలియనీర్, వ్యాపారవేత్త ఎలాన్ మస్క్. అయితే ఈ విషయంలో ఆయన న్యాయపరంగా చిక్కులు ఎదుర్కొనే అవకాశం వుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

Meta, Microsoft and hundreds more own trademarks to new Twitter name X ksp

అమెరికన్ బిలియనీర్, వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ ఇంతకాలంగా ట్విట్టర్ లోగోగా వున్న నీలి రంగు పిట్ట స్థానంలో ‘‘X ’’గుర్తును తెచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ట్విట్టర్ వినియోగదారులు, నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. అయితే ‘‘ X ’’ గుర్తుకు సంబంధించి ఎలాన్ మస్క్ చట్టపరంగా సమస్యలను ఎదుర్కునే అవకాశం వుందని అంతర్జాతీయ వార్తాసంస్థ రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. Meta (META.O),  Microsoft (MSFT.O) సహా పలు కంపెనీ ‘‘ X ’’ అక్షరంపై మేథోసంపత్తి హక్కులను కలిగి వుండటమే దీనికి కారణం. 

‘‘ X ’’ను ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కంపెనీలు విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి, ఎన్నో ట్రేడ్ మార్క్‌లలోనూ ఈ గుర్తును ఉదహరించారు. ఈ క్రమంలో ‘‘ X ’’ బ్రాండ్‌గా రూపాంతరం చెందే దశలో ట్విట్టర్‌ పలు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. అంతేకాదు.. ట్విట్టర్‌పై ఎవరైనా దావా వేసేందుకు నూటికి నూరు శాతం అవకాశాలు వున్నాయని ట్రేడ్‌మార్క్ అటార్నీ జోష్ గెర్బెన్ అన్నారు. ఆయన ఇప్పటికే ఎన్నో కంపెనీలు ‘‘ X ’’ అక్షరాన్ని కవర్ చేసేలా దాదాపు 900కు పైగా యూఎస్ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్‌లలను లెక్కించినట్లు చెప్పారు. 

ఎలాన్ మస్క్ ఈ సోమవారం తన ట్విట్టర్‌ను  ‘‘ X ’’ గా మార్చారు. అలాగే కొత్త లోగోను కూడా ఆవిష్కరించారు. ఈ నలుపు, తెలుపు రంగులతో  ‘‘ X ’’ అక్షరాన్ని రూపొందించారు. ట్రేడ్ మార్క్‌ల యజమానులు.. తమ బ్రాండ్ పేర్లు, లోగోలు, వస్తువుల మూలాలను గుర్తించే స్లోగన్స్‌ను రక్షించుకుంటారు. ఎవరైనా వ్యక్తులు తమ బ్రాండింగ్‌ను దెబ్బతీసేలా వినియోగదారుణ్ణి గందరగోళానికి గురిచేస్తే క్లెయిమ్ చేయవచ్చు. అలాగే ద్రవ్య నష్టాలకు పరిహారాన్ని సైతం వసూలు చేసుకోవచ్చు. 

మైక్రోసాఫ్ట్ 2003 నుంచి తన ‘‘ Xbox video-game system’’కి సంబంధించి ‘‘ X ’’ ట్రేడ్‌మార్క్‌ను కలిగి వుంది. మెటా ఫ్లాట్‌ఫామ్‌.. ట్విట్టర్‌కు ప్రత్యర్ధిగా చెబుతున్న థ్రెడ్‌కి కూడా నీలం, తెలుపు రంగుల్లో ‘‘ X ’’ అక్షరం మాదిరిగా కనిపించే ట్రేడ్‌మార్క్‌ను 2019లోనే రిజిస్టర్ చేయించింది. అందువల్ల మెటా, మైక్రోసాఫ్ట్‌లు తమ బ్రాండ్ ఈక్విటినీ ట్విట్టర్‌కు చెందిన ‘‘ X ’’ ఆక్రమించిందని భావిస్తే దావా వేయడానికి వెనుకాడకపోవచ్చునని గెర్బెన్ చెప్పారు. అయితే చర్యలకు సంబంధించి రాయిటర్స్ అడిగిన ప్రశ్నకు మూడు కంపెనీలు స్పందించలేదు. 

ఇకపోతే.. ఫేస్‌బుక్ పేరును మార్చినప్పుడు మెటా కూడా మేథో సంపత్తి అంశాల పరంగా సవాళ్లను ఎదుర్కొంది. ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ మెటా క్యాపిటల్, వర్చువల్ రియాలిటీ కంపెనీ MetaX లు దాఖలు చేసిన ట్రేడ్‌మార్క్ వ్యాజ్యాలను ఎదుర్కొంది. ఒకవేళ పేరు మార్పు విషయంలో మస్క్ సక్సెస్ అయితే ఇతరులు ‘‘ X ’’ అక్షరాన్ని ట్రేడ్ మార్క్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రత్యేకించి వాణిజ్యపరంగా ‘‘ X ’’ వంటి జనాదరణ పొందిన ఒక అక్షరాన్ని రక్షించుకునేందుకు ఎన్నో ఇబ్బందులు వున్నాయని లా సంస్థ లోబ్ అండ్ లోబ్‌లో ట్రేడ్‌మార్క్ అటార్నీ డగ్లస్ మాస్టర్స్ అన్నారు. మెటాకు ‘‘ X ’’  ట్రేడ్ మార్క్ వుందని ఇన్‌సైడర్ గతంలో నివేదించింది. అలాగే మైక్రోసాఫ్ట్‌కు కూడా ‘‘ X ’’ వుందని లాయర్ ఎడ్ టింబర్ లేక్ ట్వీట్ చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios